ప్రగతి మదింపు: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 చదివిన చదువులకు నికషలతో మూల్యాంకనం.
నేర్చుకున్న జ్ఞానమే సోపానం,
జ్ఞాపకశక్తి ఆయుధమవుతుంది. 
మెదడులో నిక్షిప్తమైన శక్తిని,
సాధన ద్వారా ఉపయోగిస్తే,
వ్రాత సాక్ష్యమై,సృజనాత్మకతను జోడిస్తే,
సమాధాన ప్రవాహాలు జీవనదులై పారుతాయి.
కలమే ముద్రణాయంత్రమై చకచకా సాగిపోతుంది.
పరీక్షను సహజంగా భావిస్తే,ఆందోళన అనవసరం.
భారంగా చూస్తే శార్థూలమై భయపెడుతుంది.
ఆత్మవిశ్వాసం అమ్మై వెంటే ఉంటే
అనుస్యూతంగా ఆలోచనలు పరుగెడుతాయి.
అభ్యాసం,సాధన,మూల్యాంకనం
త్రివేణి సంగమంలా కలిసి, 
భయాన్ని పారద్రోలుతాయి.
సమగ్ర నిరంతర మూల్యాంకనం దోహదపడి సన్నద్ధులను చేస్తాయి.
కామెంట్‌లు