భీష్మ పర్వము ప్రథమాశ్వాసము-* 237వ రోజు*
యుద్ధారంభం
దృతరాష్ట్రుడు " సంజయా ! ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచిన కౌరవులు పాండవులు ఏమి చేసారో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడైన సుయోధనుడు తరఫున దుశ్శాసనుడు తన వారిని పురికొల్పాడు. కౌరవ సైన్యం భేరి, మృదంగం, శంఖనాదం చేసారు. భీష్ముడు ముందుగా కదిలాడు. పాండవులు కూడా యుద్ధ సన్నద్ధమైయ్యారు. తూర్యనాదాలు మిన్నంటాయి. ఒకరిని ఒకరు ఘర్జించు కుంటున్నారు. భీముడు సింహనాదం చేసాడు. యుద్ధం మొదలైంది. భీష్ముని దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మరణుడు, వివిశంతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఎదుర్కున్నాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. నకులసహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు దుష్టద్యుమ్నుని ఆధ్వర్యంలో శరపరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసిన ఇరు పక్షాలు ఆశ్చర్య చకితులైయ్యారు. ధర్మరాజు, సుయోధనుడు తమ తమ సైన్యాలను యుద్ధానికి పురికొల్పారు. ఉభయ సైన్యాలు ఒకరితో ఒకరు తలపడ్డారు. రథములు, హయములు, గజములు, కాల్బలములు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు భీకరంగా పోరుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగిస్తూ మధ్యందిన మార్తాండుని వలె వెలిగి పోతున్నాడు. అర్జునుడు శంఖం పూరించి గాండీవం ధరించి నారి సారించి భీష్మునితో తలపడ్డాడు. ఇరువురు ఒకరిపై ఒకరు అస్త్ర శస్త్ర పరంపర కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భీకరంగా పోరు సల్పారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసి పోయాయి. అభిమన్యుడు కోసల రాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసల రాజు అభిమన్యుని సారథిని పడగొట్టి హయములను చంపాడు. అభిమన్యుడు కోసల రాజు కేతనములను, విల్లును విరిచి అతడిని గాయపరిచాడు. భీమునిపై భీష్ముడు బాణములు విడిచాడు. ఇరువురి నడుమ పోరు భీకరంగా పోరు జరుగుతుంది. నకులుని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు అతడి విల్లును ఒకేఒక బాణంతో విరిచి వేసాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు అందుకుని నకులుని మీద శరవర్షం కురిపించాడు. సహదేవునితో దుర్ముఖుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు సహదేవునిపై శరపరంపర కురిపించ సాగాడు. సహదేవుడు అతని బాణములు తుంచి, హయములను చంపి, సారథిని కొట్టాడు. యుధిష్టరుడు శల్యునితో యుద్ధానికి తలపడ్డాడు. యుధిష్టరుడు శల్యుని విల్లును తుంచాడు. శల్యుడు వేరు విల్లు తీసుకుని యుదిష్టరునిపై బాణములు కురిపించాడు.
కౌరవ ప్రముఖులు పాండవ ప్రముఖుల మధ్య భీకర యుద్ధం
దృష్టద్యుమ్నుడు ద్రోణునిపై ఉరికాడు. ద్రోణుడు అతడి విల్లును మూడు ముక్కలుగా విరిచాడు. దృష్టద్యుమ్నుడు వేరొక విల్లును తీసుకుని ద్రోణునిపై పదునాలుగు బాణాలు వేసాడు. మగధ రాజైన భూరిశ్రవునితో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఇంద్రుడు వృత్తాసురుని వలె యుద్ధం చేస్తున్నాడు. దుష్టకేతువు బాహ్లికునితో తలపడ్డాడు. మహావీరుడైన శిఖండి అశ్వథామతో తలపడ్డాడు. అశ్వథామ శిఖండి శరీరం నిండా శరములతో చీల్చుతున్నాడు. శిఖండి అశ్వధ్ధామ హృదయాన్ని చీలుస్తూ శరసంధానం చేసాడు. భగదత్తుడు విరాటునిపై ఉరికి ఆకాశం నిండిపోయేలా బాణములు వదిలాడు. కేకయరాజు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరి కేతనములు వేరొకరు విరిచారు. రథములు దిగి ఇరువురు కత్తి తీసుకుని యుద్ధం చేసుకుంటున్నారు. అది చూసిన జయద్రధుడు, ద్రుపదుడు వారికి సాయంగా నిలబడ్డారు. వికర్ణుడు యుధామన్యుడితో తపపడి ఒకరితో ఒకరు రౌద్రంగా పోరుతున్నారు. చేకితానుడు త్రిగర్తాధిపతి సుశర్మతో తలపడి అతడి ఒళ్ళంతా శరపరంపరతో తూట్లు పొడిచాడు. శకుని యుధిష్టరుని కుమారుడు ప్రతివింధ్యునితో పోరు సల్పుతున్నాడు. భీముని కుమారుడు శ్రుతసోమునితో పోరు సల్పుతున్నాడు. అర్జునిని కుమారుడు ఇరావంతుడు శ్రుతాయువుతో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఒకరి రథాన్ని ఒకరు విరుగ కొట్టుకుని వేరు రథములపై ఎక్కి యుద్ధం చేస్తున్నారు. విందాను విందులు కుంతి భోజుడు అతని కుమారునితో తలపడ్డారు. కుంతి భోజుని బాణములుఎదుర్కొంటూ అనువిందుడు అతనిపై శరపరంపర కురిపించాడు. కేకయ రాజులు అయిదుగురు గాంధార రాజు అయిదుగురితో తలపడ్డారు. విరాటుని కుమారుడైన ఉత్తరునిపై నీ కుమారుడు దీర్ఘబాహుడు తలపడ్డాడు. నకులుని కుమారుడు శతానీకుడు ఉలూకునితో తలపడ్డాడు. చతురంగ బలాలు పదులు, వందలు, వేలుగా ఒకరితో ఒకరు పోరుతున్నారు. కత్తులతోను, బాణములతోను ఒకదానితో ఒకటి తలపడ్డాయి.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి