దుర్యోధనుడిలా కాక...: - - యామిజాల జగదీశ్
 ఓరోజు ధృతరాష్ట్రుడు కృష్ణుడితో "ఎవరెవరితో ఏవేవో చెప్పే కన్నా నువ్వు దుర్యోధనుడికి ఏదైనా ఉపదేశించి వచ్చు కదా...." అంటాడు.‌
కృష్ణుడు సరేనని వెళ్ళి దుర్యోధనుడిని కలిసి తానొచ్చిన విషయం చెప్తాడు.‌ అయితే దుర్యోధనుడు టాడు కదా..."ఇదిగో కృష్ణా, నాకు మంచేదో చెడు ఏదో తెలుసు.‌ ఏం చేస్తే పుణ్యమో ఏం చేస్తే పాపమో నాకు తెలుసు.‌ కానీ నేను చెయ్యను.‌ నాకు అనిపించిందే చేస్తుంటాను.‌ చేస్తాను కూడా.‌ దాని ఫలితాలను అనుభవిస్తాను.‌ చేసేదేమీ లేదు.‌ కనుక నువ్వు ఏదైనా ఉపదేశించాలనుకుంటే అర్జునుడికి చెప్పు.‌ వాడికి మంచేదో చెడేదో తెలీదు...కనుక నీ ఉపదేశం వాడికే చాలా అవసరం" అంటాడు. 
తర్వాత కథనం తెలిసిందేగా.‌ కురుక్షేత్రంలో కృష్ణపరమాత్మ భగవద్గీతను అర్జునుడికి చెప్పాడు. మనందరికి మంచేదో చెడు ఏదో తెలిసినా అవసరార్థం ఏదో ఒకటి చేసేస్తాం. దానికి ఫలితాన్నీ అనుభవిస్తాం. మనం దుర్యోధనుడి లా కాకుండా అర్జునుడిలా ఉండటానికి ప్రయత్నిద్దాం.

కామెంట్‌లు