ఓ జెండా: - Dr సి వసుంధర, చెన్నై.09790878439
 ఓ జెండా: 
ఆకాశం నిండా నిండి
పరపరి పాలనా ఎండ
మామీద పడకుండా
కాపలా కాస్తున్నావా
నీ అమ్మకడుపు చల్లగా నుండ
 
ఓ జెండా
విస్తరించిన నీ కీర్తిని
కీ ర్తించు నీ నోటనే
ఆడిగానని అనుకోవద్దు
చెప్పకుండా దాటేయ్యొద్దు.

ఐతే
చెబుతా మరి విను.
తెల్లవాడి బూటుకింద
మనవారి సర్వస్వమ్
నాశనం.
వందల వత్సరాల 
బానిసత్యం, పలాయనంచిత్తగించింది
బాపూ చేతి కర్రతో.దెబ్బతో ..పరుగులు
పెడుతూ వచ్చింది
స్వాతంత్రం సంతోషంగా.
తెల్లవాడి చేతులు
తప్పుకొన్నాయి
తెల్లారేసరికల్లా
మొలుచుకొచ్చాయి మనవారి
కబంధ హస్తాలు.

మనిషి బతగటానికి కావాలి
ఓటుహక్కు.
ఓటు ఓటిదైయింది 
నోటు కొనేసింది
సగటు మనిషి సంగతి
షరా మామూలే.
 ఓ నేస్తమా
మన దేశంలోని
పాపాలచిట్టాలను,
నేరాల గుట్టలను
భస్మం చేసే పాపలు
పుట్టినప్పుడే
నే ఠీవిగా తలెత్తుకొని 
తిరుగుతా.
ఆకాశమంత నా ఆశను
తీర్చాలి వారంతా.
అప్పుడే ఈ జెండాకు
పండగ.ఈ లోపల
అన్ని దండగే
ఈ రోజు రావడానికి
ఎంత చరిత్ర ఉందొ
ఒక్కసారి చదవాలి మీరు
గుండె చలిస్తోంది
పచ్చి పుండులాంటి
ఆ జ్ఞాపకాలు
మీకు కావాలి
జ్ఞాపికలు.అప్పుడే
గణ తంత్ర దినోత్సవం
సార్ధకం .

కామెంట్‌లు