ఇంజనీర్ వేదకుమార్ మణికొండ INTACH జాతీయ కార్యవర్గానికి ఎన్నిక
  న్యూ ఢిల్లీలోని INTACH ప్రధాన కార్యాలయంలో, ఇటీవల (2026–2029) మూడు సంవత్సరాల కాలానికి INTACH గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నికైన ఇంజనీర్ వేదకుమార్ మణికొండ గారు, ఇప్పుడు INTACH జాతీయ కార్యవర్గానికి కూడా  ఎన్నికయ్యారు.
ఈ విషయాన్ని INTACH చైర్మన్ శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారు, సభ్య కార్యదర్శి శ్రీ రవీంద్ర సింగ్ (రిటైర్డ్ IAS) సమక్షంలో ప్రకటించారు.
ఈ గౌరవం ఆయన నాయకత్వం, అనుభవం మరియు వారసత్వ పరిరక్షణపై ఉన్న అంకితభావానికి గుర్తింపుగా నిలుస్తోంది. ఈ పదవికి ఆయన ఎన్నిక కావడం ద్వారా సంస్థ పనుల్లో ఆయన మరింత సమర్థంగా సేవలందిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది.
ఈ విజయం ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశం నుండి INTACH జాతీయ కార్యవర్గానికి ఎన్నికైన కొద్దిమందిలో ఇంజనీర్ వేదకుమార్ మణికొండ గారు ఒకరు. ఇది ఆయన వ్యక్తిగత కృషితో పాటు, జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశ ప్రాధాన్యం పెరుగుతున్నదనికీ సూచిస్తుంది.
సాంస్కృతిక వారసత్వం, పరిరక్షణ మరియు విద్యా రంగాల్లో ఆయన చేసిన దీర్ఘకాల సేవలతో, ఆయన జాతీయ కార్యవర్గంలో భాగమవడం INTACH కార్యక్రమాలను మరింత బలపరచడంలో మరియు దేశవ్యాప్తంగా విస్తరించడంలో సహాయపడుతుంది.
కె. ప్రభాకర్
సెక్రటరీ, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్
మొబైల్: 8106721111

కామెంట్‌లు