యాలాలలో టాలెంట్ సర్చ్ టెస్ట్ విజయవంతం – MEOకు ఎమ్మెల్యే సన్మానం: వెంకట్ , మొలక ప్రతినిధి

 వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని యాలాల మండల పరిధిలోని మొత్తం 53 పాఠశాలల్లో సుమారు 600 మంది విద్యార్థులతో టాలెంట్ సర్చ్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.
ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బి. మనోహర్ రెడ్డి గారు యాలాల మండల ఎంఈఓ శ్రీ శేరి మహిపాల్ రెడ్డి గారిని తాండూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
అలాగే, వచ్చే జూన్ నెలలో తాండూర్ నియోజకవర్గ స్థాయిలో మరింత విస్తృతంగా టాలెంట్ సర్చ్ టెస్ట్ నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ శేరి మహిపాల్ రెడ్డి గారి కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
కామెంట్‌లు