ఘనంగా అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానo

 విజయవాడలో  24 గంటల రికార్డు సాహిత్య ప్రభంజన విజయభేరి  ఘనంగా  అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానo కార్యక్రమం ఆకట్టుకు నున్న  సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు 
పోగ్రామ్ డైరెక్టర్ డా.యు.వి రత్నo 
జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి 

------------------------------------------------------------
అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135 వ జయoతి వేడుకలులో భాగంగా  రెండు రోజులు పాటు కవులు కళాకారులు  సాహితీ సంస్థల నిర్వాహకులను  గుర్తించి 100 మంది సాహితీ ప్రముఖులను అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారంతో ఘనoగా సత్కారం చేయడము జరిగింది అలనాటి మధురమైన పాటలతో పాటు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకొనున్నాయని పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి తెలియజేసారు. రంగస్థల కళాకారులను గుర్తిస్తూ ప్రోత్సాహకంగా  గౌరవిస్తూ కళారంగాన్ని ముందుకు తీసుకోవడమే లక్షoగా ముందుకు సాగుతున్నామనీ మేనేజింగ్ డైరక్టర్ డా. యు. వి రత్నo తెలియజేశారు. విజయవాడ కౌత పూర్ణానంద వేదిక గాంధీనగర్ లో జరిగిన కార్యక్రమంలో 100 మంది కవులు కళాకారులును రెండు తెలుగు రాష్ట్రాల నుండి  అవార్డును  స్వీకరించారు ముఖ్య అతిథిగా అడిషనల్ రీటైడు ఎస్పీ  మురళీ కృష్ణ   మరియు ప్రముఖ సేవకులు డా .వి.డి. యస్ ప్రసాదు  రిటైర్డ్ కమర్షియల్ ఆఫీసర్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ డేవిడ్ రాజు గారు   తాళ్లూరి రామారావు    డాన్సు గురువు  శ్రీనివాస్ రెడ్డి గారు అతిధులుగాను .కార్యక్రమంకి విచ్చేసి  24 గంటల రికార్డు సర్టిఫికేట్ తోపాటు డా. అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారంను నాట్యమాధురీ సేవా పురస్కారంను ప్రదానం చేయడము జరిగింది నిర్వాహకులు డా. యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి  జాతీయ అధ్యక్షురాలు పోగ్రామ్ డైరెక్టర్ తెలుగుదనాన్ని సాంస్కృతి సంప్రదాయాలను మును ముందుకు తీసుకుపోయే లక్ష్యంగా అలుపెరుగని సాహితీ యజ్ఞంను మును ముందుకు  తీసుకెళ్ళుతూ  ప్రతి నెల వినూత్న కార్యక్రమాలతో .కొనసాగుతున్నామని తెలియజేశారు.
కామెంట్‌లు