ప్రవాస పద్య పరిమళం - 10: -- వెంకట్ కొత్తూర్ Ashburn VA USA

నేటి అంశం : న్యస్తాక్షరి 
పాదాది న్యస్తం..
సు - ప్ర - భా - తం
విషయం : సూర్యోదయం 
ఛందస్సు : స్వేచ్ఛ 

పాదాది న్యస్తము లో నిర్దేశించ బడిన అక్షరాలు ప్రతి పాదములో మొదటి అక్షరాలుగా వుండాలి. 

ఆటవెలది:

*సు*ప్రభాత వేళ సూర్యోదయమ్ము న 
*ప్ర*భల వెలిగె తూర్పు పసిడి కాంతి 
*భా*స్కర కిరణాల ప్రకృతి పులకరించ
*తం*బుర నినదాల తరులు మురిసె 

కామెంట్‌లు