వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
82. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా
(షోడశాక్షరీ)
83. బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్థుత వైభవా
(షోడశాక్షరీ)
ఎనభై మూడవ నామ మంత్రము -
ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః
ఇంతవరకూ భండాసురుడు, అతని సోదరలూ, అతని సైన్యం పెట్టిన అనేకానేక బాధలను అనుభవించిన, దేవీ దేవతలు, దేవ సైన్యం, భండాసురుని తోపాటు వాని బంధువులు, సైన్యం, శూన్యక నగరము కూడా నాశనము అవడాన్ని, తమ కళ్ళతో చూసి, పరమానందాన్ని అనుభవించారు. దేవ ప్రముఖులు అందరూ, తమ కృతజ్ఞతలు అమ్మకు తెలుపుతూ శిరసా నమస్కరించారు. ఈ విధంగా దేవతల అందరి నుండీ, ప్రణామాలు అందుకుంటున్న పరమేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్థుత వైభవా" అని వేనోళ్ళ కొనియాడారు. ఆ విధంగా త్రిమూర్తుల నతులు అందుకుంటున్న పరమేశ్వరికి నమస్కారము.
భండాసురుని వలన త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే బాధింపబడ్డారు. ఇంక, వీరి గణముల సంగతి చెప్పడానికి, వినడానికి ఏముంటుంది. అందరూ ప్రాణాలను అరచేత పెట్టుకున్న వారే. అమ్మ, త్రిజగన్మాత శరణు వేడుకున్నవారే. దేవతల అందరి వేడుకోలు, శరణు ఘోష విన్న తల్లి మనసు కరిగి, శ్రీచక్రాజరథమును ఎక్కి, సర్వ శస్త్రాస్త్రాలనూ ధరించి, అశ్వారూఢా, వారాహి మొదలైన దశ శక్తులు శక్తి సేనలతో వెంట వస్తుంటే, జ్వాలామాలినీ, వహ్నివాసినులైన అగ్ని భట్టారకుని అంశల రక్షణలో, పాశుపతము, మహాపాశుపతము, కామేశ్వరాస్త్రములతో భండాసురుని, బంధువులను, శూన్యక నగరాన్ని సర్వనాశనం చేసి, దేవతలను, దేవతా గణాలను రక్షించింది.
ఎప్పుడైతే తమకు, తమ గణాలకు సంపూర్ణ రక్షణ అమ్మ ద్వారా లభించిందో, త్రిమూర్తులతో కూడి దేవీదేవతలు అందరూ అమ్మ శౌర్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని వేనోళ్ళ కొనియాడారు. పరి పరి విధాల స్థుతులు చేసారు. అప్పటి ఆ దృశ్యం, సర్వనేత్రానందం. ఈ దృశ్యాన్ని చూచిన వారు ధన్యులు. విన్నవారు కృతార్ధులు. ఈ విధంగా అమ్మలగన్నయమ్మ "బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్థుత వైభవా" అయింది అని కీర్తించారు ఋషులు, మునులు, తాపసులు, యోగి పుంగవులు.
ఇలా సకల దేవతా సమూహాల చేత కీర్తింపబడుతున్న అమ్మ వైభవం చూచి తరించవలసినదే. విని బ్రహ్మానందాన్ని అనుభవించాల్సిందే. "విభుత్వము" చేత వచ్చినది "వైభవము". విభుత్వము అంటే, సర్వవ్యాపకము. అంటే మూడు లోకాలలో వ్యాపించి ఉన్న శక్తి. పరమాత్మ లేక పరమేశ్వరి అంతటా వ్యాపించి ఉండి సర్వవ్యాపకము అయ్యారు.
భండాసురుని రూపంలో జగత్తు మొత్తాన్ని కప్పి ఉంచిన అజ్నానాన్ని, అరిషడ్వర్గాలను, మూర్ఖత్వాన్ని, క్రూరప్రభావాన్ని, కామేశ్వరాస్త్రంతో పోగొట్టి, మనలను కాపాడడానికి అహరహమూ, మూడుకాలాలలో సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు
ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి