డాక్టర్.కె.జానకిగారి పుస్తకం"రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్
మందసకి చెందిన దువ్వాడ బాలకృష్ణమ్మకి 14సెప్టెంబర్ 1940లో ఒక ఏడాది కఠిన కారాగారశిక్ష విధించబడింది.కారణం ఆనాటి శ్రీకాకుళం లో మందసా ఎస్టేట్స్ రైతుల ఆందోళనలో ఆమె పాల్గొన్నారు.సోంపేట తాలూకా లోనిమందసా లో పుట్టిన ససుమాను గున్నమ్మ రైతుల కి మద్దతుగా నిల్చి ప్రభుత్వ అధికారుల అవినీతిని చీల్చిచెండాడింది.పోలీసుల కాల్పులను అడ్డుకుంది. 1 ఏప్రిల్ 1940లో ఆకాల్పుల్లో ఆమె చనిపోయారు.అప్పటికామె గర్భవతి! రాజమణిపురంలో ఆమె నేలకొరిగింది.ఆప్రాంతానికి " వీరగున్నమ్మపురం" అని పేరుపెట్టి స్మరించుకున్నారు.ఇలా పోలీసులను ఎదిరించిన గొర్ల పున్నమ్మ మందసరైతుఆందోళనలో పాల్గొని తుపాకీ కాల్పుల్లో గాయపడినా, 14సెప్టెంబర్ 1940లోజైలుశిక్ష అనుభవించిన మందసా మహిళ!ఆనాటి గిద్దలూరు కి చెందిన బొగిలి అనే పల్లెలో 1926లో చిగిరెడ్డి లీలాదేవి జన్మించారు.తండ్రి కోటిరెడ్డి పెద్ద రెడ్డి.ఆమెభర్త బాలిరెడ్డి. 400రు.ఫైన్ తో25జనవరి 1941లో7నెలలు వెల్లూర్ జైలుశిక్ష అనుభవించిన మగువ. కాలనాధభట్ల మహలక్షమ్మ, శిస్ట్లా సోదెమ్మ శిస్ట్లా లింగమ్మ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుశిక్ష అనుభవించారు.విశాఖ పట్టణంకి చెందిన లేడీ దేశాయ్ భర్త ఎం.జి.దేశాయి.1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్టయింది🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి