మరుగున పడిన మగువలు14:- అనువాదం... అచ్యుతుని రాజ్యశ్రీ
 డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh **
డాక్టర్ నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి తల్లిదండ్రులు శేషమ్మ నర్సయ్య గార్లు. లక్ష్మికి చదువుపై శ్రద్ధ ఆసక్తి,కానీ బాల్యవివాహం,ఆపై కొద్దికాలానికే ఆచిన్నారి బాలవితంతువు కావటంతో  మేనమామ ఆచిట్టితల్లిని ప్రోత్సాహించారు.1925లో ఆమెఅనంతపురం జిల్లాలో తొలి లేడీడాక్టర్ గా రికార్డు సృష్టించింది.బాంబేలో మెడికల్ విద్యార్ధినిగా  అక్కడున్న రాజకీయ సంఘసంస్కర్తల ప్రభావం ప్రోత్సాహంతో స్వేచ్ఛ స్వతంత్ర భావాలతో ఎదిగింది.1929లో  మేనమామ దగ్గర పనిచేసే జూనియర్ లాయర్  శ్రీ నివర్తి మృత్యుంజయశాస్త్రితో పెళ్లి, సంఘసేవకురాలిగా మారడం గొప్ప మలుపు.
మన ఇల్లు,మనవీధి,మన ఊరిబాగు ఆరోగ్యం ముఖ్యం అని భావించిన ఆమె ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు.దుర్గాబాయమ్మ తో పరిచయం, పికెటింగ్,విదేశీవస్తు బహిష్కరణ లో చురుకైన పాత్ర పోషించిన ఆమెను అరెస్ట్ చేశారు. 200రూ.ఫైన్, కఠిన కారాగారశిక్ష విధించడంతో 1932లో వెల్లూరు జైలులో ఉన్నారు.అక్కడ ఆడఖైదీలదుస్థితి జూసి ఆందోళన చేసిన ఆమెను భరించలేక  మధురై జైలుకి తరలించారు.విడుదలైన తర్వాత లక్ష్మీదేవి హరిజనోద్ధరణకై నడుంబిగించారు.సహపంక్తిభోజనాలు ప్రోత్సాహించారు.1934లో హరిజనఫండ్ ని సేకరించి గాంధీజీ బళ్లారికి వచ్చినపుడు ఆయనకి సమర్పించారు.కాంగ్రెస్ పార్టీలో మహిళలు చురుకుగా చేరారంటే ఆమె ప్రోత్సాహం,ప్రేరణయే కారణం!
1935లో ఆనాటి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ మెంబర్ గా ఎన్నుకున్నారు.ఆమె హరిజనహాష్టల్ నెలకొల్పారు.బళ్లారి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ గా ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కి హాజరై ఎన్నో విషయాల్లో మార్పులు చేర్పులు సూచించారు.శాస్త్రిదంపతులు రాయలసీమ అనే పేరుని సూచించారు.అలాగే తుంగభద్ర ప్రాజెక్టు కి కారకులు వారే! ఆమహనీయురాలు ఫిబ్రవరి1976లో పరమపదించారు.ఇలాంటి సంఘసంస్కర్తలు,నిస్వార్థ దేశభక్తులు ఇలా మరుగున పడటం విచారకరం! 🌷

కామెంట్‌లు