మద్రాస్ ఆకాశవాణిలో పనిచేస్తున్న శ్రీనాగసూరిగారికి 2016లో ప్రమోషన్ పై తిరుపతికి ట్రాన్స్ఫర్ కావటంతో అక్కడ వెంటనే చేరారు.అక్కడ ఆయన చేసిన ప్రోగ్రాముల మార్పులు చేర్పులు సర్వజనసమ్మతంగా అందరినీ అలరించాయి.ఆయన ప్రోగ్రాం హెడ్ గా,హెడ్ ఆఫ్ ఆఫీస్ గా 2ఏళ్లు పనిచేశారు.మధ్యాహ్నం తెలుగుకార్యక్రమాల నిడివి పెంచటం ఒకటి.తిరుపతి ఆకాశవాణిలో తెల్లారుఝామున 3 నుంచి తిరుమల గుడి ప్రత్యక్షప్రసారం 3గంటలుంటుంది.మద్రాస్ లో వారుకూడా వింటారు.అందుకే ముఖాముఖి ప్రోగ్రాం ఏర్పాటుచేస్తే చిత్తూరు,నెల్లూరు,కడప మొదలైన ప్రాంతాల నుంచి50_60మంది శ్రోతలు వచ్చి పాల్గొన్నారు.2017లో జనవరి3_7 దాకా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను విజయవాడ, హైదరాబాద్ సహోద్యోగులతో కల్సి నిర్వహించారు.14నవంబర్ 2017లో వరల్డ్ డయాబిటీస్ డే సందర్భంగా గోవింద రామస్వామి డిగ్రీకాలేజీలో మెడికల్ క్యాంప్ నిర్వహణ,డా.కృష్ణ ప్రశాంతి,నిరంజన్ రెడ్డిగార్ల సహకారంతో విజయవంతమైంది.తిరుమల బ్రహ్మోత్సవాల రన్నింగ్ కామెంట్రీ వ్యవధి పెంచటం,వరల్డ్ రేడియో డే,ప్రపంచ మహిళావారోత్సవాలని శ్రీపద్మావతీ యూనివర్శిటీలో నిర్వహించడం,ప్రొ.నీలిమ, ప్రొ.పి విజయలక్ష్మిగార్లు సహకరించటంతో అందరిమెప్పు పొందింది ఆప్రోగ్రాం!15ఆగస్ట్ 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఎగరేయటం ప్రత్యక్షప్రసారంలో నందివెలుగు ముక్తేశ్వరరావు,పి వి రంగనాయకులు గారు వ్యాఖ్యాతలుగా సాగిన ప్రోగ్రాం అది.ప్రతినెలా"రండి చూసొద్దాం తారామండలం" ని ప్రత్యక్షప్రసారం కి శ్రోతలు పిల్లలతో రావడం విశేషం.మణిగండన్ తోడ్పాటు,డా.పి.ఎస్.గోపాలకృష్ణ గారి ప్రశంసలు హైలైట్.10మార్చి 2017లో పిల్లల చెంత కతలపండుగనుమహాత్మా గాంధీ మున్సిపల్ స్కూల్లో నిర్వహించారు.4గురుకథకులతో పిల్లల స్పందన బాగుంది.శివరాత్రికి పద్యసాహిత్యప్రోగ్రాం గంటసేపు పండితుల చే నిర్వహింపబడటం, వెటర్నరీ కాలేజీలో కవితాసేద్యంపేరుతో కవిసమ్మేళనం పేర్కొనదగినవి. కమీషనర్ స్వామినాధన్ తోడ్పాటుతో జి.ఎస్.టి.పై అవగాహన కల్పించిన ప్రోగ్రాంతో తిరుపతి ఆకాశవాణికి ఆదాయం లభించడం విశేషం!ఆకాశవాణిలో స్వచ్ఛభారత్ కింద తోట పెంపకం,భవనంలో చారిత్రక కోటల చిత్రాలు పెట్టడం,అదనపు పనులను ఇష్టంగా చేసి సంతోషం సంతృప్తి పొందారు శ్రీవేణుగోపాల్ గారు🌹
ఆకాశవాణి సమాచారం17 :- సేకరణ..అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి