శ్రీనాగసూరిగారు ప్రసిద్ధ సంపాదకులు శ్రీ సి.రాఘవాచారిగారిని ఆకాశవాణి విజయవాడ లో ఇంటర్వ్యూ చేశారు.ఆయన గొప్ప చదువరి,సులువు గా అర్ధం అయ్యేలా చెప్పడంలో దిట్ట. కానీ రాసేఅలవాటు తక్కువ. చేతిలో కాగితంలేకుండా అద్భుతంగా అరటిపండు వలిచి చేతిలోపెట్టినట్లు ఏవిషయమైనా చకచకా చెప్పగల ప్రతిభాశాలి.6భాగాల ఇంటర్వ్యూ ధారావాహిక తెలుగు ఆకాశవాణిలో చరిత్ర సృష్టించింది.పైగా ఆయన వేణుగోపాల్ గారిని గూర్చి అన్న మాట ఇది"ఉషశ్రీగారి తోడ్పాటుతో ఆకాశ వాణి ప్రోగ్రామ్స్ చేశాను.కానీ నాగసూరిగారు చాలావైవిధ్యమైన కార్యక్రమాలు చేయించారు". అది నిజంగా అపూర్వ ప్రశంసకదూ!?అలాగే శ్రీసర్దేశాయి తిరుమలరావుగారు ఓ.టి.ఆర్.ఐ.లో ఖ్యాతి గడించారు.1945లో అనంతపురం లో ఆసంస్థ తైలసాంకేతిక పరిశోధనాసంస్థ లో ఆయన పరిశోధన చేశారు.ఆసంస్థ కే చెందిన శ్రీ అజీముద్దీన్ గారితో అనంతపురం ఆకాశవాణిలో 10 పరిచయకార్యక్రమాలు రికార్డుచేసిన ఘనత శ్రీనాగసూరిగారిదే! అలాగే 2018లో తిరుపతి ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడే మదనపల్లెలోని బి.టి.కాలేజీ వందేళ్ల ఉత్సవాలు జరిగిన టైంలో జిడ్డుకృష్ణమూర్తిని బాగా అధ్యయనం చేసిన డా.గండికోట వేదపారాయణగారితో10భాగాల ఇంటర్వ్యూని ప్రసారం చేయటం నిజంగా ఫలించిన ప్రయోగాలు!🌹
ఆకాశవాణి సమాచారం 20:-సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి