ఏడాదిపాటు పర్యటనలు, చర్చ, సామాజిక చైతన్యానికి పిలుపు...
శాశనోల్లంఘన ఉద్యమం ఆరు వారాలు నిలుపుదల
కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు- గాంధీజీ బేఖాతరు ...
భారత స్వాతంత్ర్య సమరంలో శాశనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులవి. గాంధీజీ తో పాటు పలువురు జాతీయ నేతలను బ్రిటిష్ ప్రభుత్వం పూనె లోని ఎరవాడ జైలులో నిర్బంధించారు. జైలు జీవితం గడుపుతున్న గాంధీజీ అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. 1933 మే 8 నుండి 21 రోజుల పాటు తాను స్వీయ శుద్ధీకరణ ( ఆత్మ శుద్ధి ) పేరుతో నిరాహారదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. భారత మాతకు అవమానకరంగా భావిస్తున్న అమానుషమైన అస్పృశ్యతా దురాచారంపై పోరాటానికి, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, తద్వారా ప్రజలను చైతన్య పరచి భారత దేశంలో అంటరానితనం నిర్మూలనకు తాను ఈ దీక్ష చేపడుతున్నట్లు గాంధీజీ ప్రకటించారు. శాశనోల్లంఘన ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో దానిని ఆరు వారాలు నిలుపుదల చేసి సామాజిక రుగ్మతలపై దృష్టి మరల్చడాన్ని కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం చెప్పారు. అయినా, గాంధీజీ నిరాహారదీక్ష కొనసాగించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జైలు నుండి విడుదల చేసారు. జైలు నుండి విడుదలైనా ఆయన 21 రోజుల పాటు దీక్షను కొనసాగించారు.
జాతీయ నాయకులు దేశవ్యాప్తంగా పర్యటించి సమావేశాలనేర్పాటుచేసి అస్పృశ్యత పై చర్చించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, అస్పృశ్యత లేని సమ సమాజం కోసం కృషి చేయాలని గాంధీజీ పిలుపునిచ్చారు. అస్పృశ్యతను అమానవీయంగా ప్రజలు గుర్తించారు. గాంధీజీ సూచించినట్లు ఆరు మాసాల విరామం తర్వాత శాశనోల్లంఘన ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. భారత స్వాతంత్ర్య సమరంలో ఓ వైపు ఉద్యమం కొనసాగిస్తూనే , సామాజిక అసమానతలపై పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎత్తుగడలు, వ్యూహాల రచన సాగుతుండేవి. 93 ఏండ్ల క్రితం భారతావని ఉజ్వల భవిష్యత్తుకై గాంధీజీ ఆలోచనలు, ఆచరణ , సామాజిక స్పృహ అభినందనీయం. నిత్య స్మరణీయం.
---------------------------------------------------------------------------------
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి