*డాక్టర్.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh *
నెల్లూర్ వాసి పొణకా కనకమ్మ గారు తొలి సోషల్ వర్కర్ గా,నెల్లూర్ కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర పోషించిన నారీమణి.1896 లో పుట్టిన ఈమె తండ్రి శ్రీ మరుపూరు కొండారెడ్డి.భర్త శ్రీసుబ్బరామిరెడ్డి.1920నుంచి కనకమ్మగారు రాజకీయాల లో చురుగ్గా ఉన్నారు.ఆనాటి నేత బిపిన్ చంద్ర పాల్ ఆంధ్రాకి వచ్చినపుడు ఈమె ఇంట బసచేశారు.నెల్లూర్ ధ్రువతార గా నెల్లూర్ కాంగ్రెస్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా,సుజనరంజని సమాజం ని నెలకొల్పారు. 1913_14లోవివేకానందలైబ్రరీని స్థాపించటమేగాక బీదాబిక్కీకి సాయంచేశారు.ఆరోజుల్లో జిల్లాఅంతటా వ్యాపించిన కలరా,స్మాల్పాక్స్,ఇన్ఫ్లుయంజా వ్యాపించినపుడు, మందులపంపిణీ, శుచిశుభ్రతలపట్ల అవగాహన కల్గించారు.కొత్తూరిలో బ్రాంచ్ లైబ్రరీని గోఖలే పేర నెలకొల్పారు.1916_17లో ఆనాటి ప్రసిద్ధ వ్యక్తులు సర్వశ్రీ కాశీనాథయ్య నాగేశ్వరరావు,చిలకమర్తి, డా.ఆచంట లక్ష్మీపతి దంపతులు,అయ్యదేవర కాళేశ్వరరావుగార్లు ఆసంస్థలను దర్శించారు. తన పరదా ఘోషా ని పక్కన పెట్టి కనకమ్మ గారు నూలువడకటం,రాజకీయాల్లో పాల్గొనటంలో చురుకైన పాత్ర పోషించారు.కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారి సతీమణి రాంబాయమ్మగారు అధ్యక్ష హోదాలో మహిళలను ప్రోత్సాహించారు.పొట్లపూడిలో శాకాహార భోజనం,చరఖాలపంపిణీ,విదేశీ వస్తువులబహిష్కరణ మొదలైన కార్యకలాపాలతోపాటు ఆమె,కుటుంబ సభ్యులు వడికిననూలును గాంధీజీకి పంపేవారు.
కనకమ్మ గారు తన నగలన్నీ అమ్మి పినాకినీ ఆశ్రమాన్ని పల్లెపాడులో స్థాపించారు.గాంధీ దాన్ని ప్రారంభించారు.1923లో నెల్లూరులో కస్తూరీదేవి విద్యాలయాన్ని నెల కొల్పారు.కస్తూరీదేవి ఇండస్ట్రియల్ స్కూల్ పెట్టినట్లు వడకటం,నేతపని,ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్,టీచర్ ట్రైనింగ్ ..ఇలా స్త్రీలకు వృత్తివిద్యల్లో శిక్షణ ఇప్పించారు.17.6.1944లో కస్తూర్బా నేషనల్ హైస్కూల్ గా తిక్కవరపురామిరెడ్డి,బెజవాడ గోపాలరెడ్డి మొదలైన వారి సహకారంతో విరాళాలతో నడిచింది.ఎ.సి.సుబ్బారెడ్డిగారు భూదానంచేశారు.దుర్గాబాయ్ దేశ్ముఖ్15000 సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తరుఫున గ్రాంట్ ఇవ్వడంతో ఆరెండుసంస్థలు నిలదొక్కుకున్నాయి.కనకమ్మ గారు మంచిరచయిత్రికూడా.గృహ లక్ష్మి,హిందూసుందరిలో ఆమె రచనలు పుంఖానుపుంఖాలుగా వెలువడినాయి. రమణ మహర్షి భక్తురాలు.శ్రీరమణబ్రహ్మాంజలిని రాశారు.ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి కవితలల్లటం,రచనలు,భగవద్గీత అనువాదం చేయటంతో జంట కవయిత్రులుగా కీర్తిగాంచారు. చతుర్వేదుల రంగయ్య, దీపాలపిచ్చయ్య మొదలైన వారికి పుస్తకాలు ప్రచురించేందుకు ఆర్ధిక సాయంచేశారామె.ఎల్లాయిసూరమ్మగారు 1904 లోబెర్హంపుర్(గంజాం)లో జన్మించిన ధీర వనిత. తండ్రి శ్రీ పూడిపెద్ది కృష్ణ మూర్తి,భర్త శ్రీ సన్నయ్య అధ్యాపకునిగా పనిచేస్తూ సహాయ నిరాకరణోద్యమంలోపాల్గొనాలని జాబ్ కి రిజైన్ చేసి ఎన్నోసార్లు జైలుశిక్ష అనుభవించి 1944లోనే జైల్లో మరణించిన త్యాగమూర్తి.సూరమ్మ భర్త అడుగుజాడలలోనే నడిచింది. లాఠీచార్జితో పాటు ఆమెకు రెండేళ్ల బిడ్డ ఉన్నావెల్లూరు కన్ననూర్లో కఠిన కారాగారశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం.ఐనా హిందుస్థాన్ సేవాదళ్ లో శిక్షణ పొంది బెర్హంపుర్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా పనిచేసి ఆఖరికి బ్రహ్మ సమాజంలో చేరారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి