మరుగునపడిన మగువలు 23:-అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 డా.కె.జానకిగారిRoleof women in freedom struggle in Andhra Pradesh *
నెల్లూర్ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి ఓరుగంటిమహలక్ష్మమ్మ 1885లో విజయవాడ లో పుట్టారు.కావలి నివాసి.తండ్రి శ్రీ తూములూరు శివకామయ్యగారు. భర్త శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారు.ఆనాటి నగరసంకీర్తనలో  దేశ భక్తిగీతాలాపనచేస్తూ కాంగ్రెస్ కార్యకర్త గా చేసిన సేవ మరపురానిది.1921లో కాంగ్రెస్ లో సభ్యులను చేర్చటం,విదేశీవస్త్రాల్ని తగలబెట్టడం, కస్తూర్బా గరల్స్ హైస్కూల్ కి విరాళాలు,బియ్యం సేకరించేవారు. అలాగే పల్లెల్లో తిరిగి మద్యం కి వ్యతిరేకంగా పోరాటం చేశారు.స్వదేశీఖద్దరుదుస్తులుధరించటమే గాక,నేతపనివారికోసం ఓషాపు తెరిచి ఉపాధి కల్పించారు.బెంగాల్ విభజనకువ్యతిరేకంగా దేశ భక్తిగీతాలు పాడుతూ తిలక్ ప్రభావంతో స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.1910లో కావలిలో స్త్రీసమాజాన్ని స్థాపించి,ఇంట్లోనే బడి నడిపారు.మహలక్షమ్మ వితంతువివాహాల్ని ప్రోత్సాహించి తన 3వకొడుకు పెళ్లి ని ఓబాలవితంతువుతో జరిపించటం ఆరోజుల్లో ఓసంచలనం.ఆకుర్రాడు కాశీవిద్యాపీఠ్ లో చదువుకున్న  విశాల హృదయుడు.1917లో భర్త  తన బారిష్టర్ జాబ్ వదులుకుని దేశంకోసం పోరాడాలని నిశ్చయించుకుని నెల్లూర్ లో కాపురం పెట్టడంతో,మహలక్షమ్మ డా.అనీబిసెంట్ ప్రభావంతో హోంరూల్ బాడ్జి పెట్టుకుని ఆంధ్రాలో దాని వ్యాప్తికై కృషిచేసింది.  పొణకా కనకమ్మ తో కల్సి పనిచేసి సారావ్యతిరేకోద్యమంలో, ఖాదీ ప్రచారంలో ఇతరులకు మార్గదర్శకురాలైంది. కుటుంబం మొత్తం దేశ సేవ లో అంకితం కావటం విశేషం.ఆమె 3వ కూతురు మైత్రేయి సన్నని నూలు వడికి బంగారుపతకం పొందటం విశేషం.1927లో నెల్లూర్ లో తుఫాన్ సమయంలో,1928లో కావలిలో కలరావ్యాధి వ్యాపించినపుడు అగ్నిప్రమాదం టైంలో ఎనలేని సేవలు చేశారామె.గాంధీజీకి స్వయంగా తనవంటిమీది నగలను తీసిఇచ్చిన తొలి తెలుగు వనిత మాగంటి అన్నపూర్ణాదేవి.1921లో విజయవాడ లో  మహిళల సభకి ఖద్దరు చీరలో హాజరైన ఏకైక మగువ అని గాంధీజీ మెప్పుపొందిన తెలుగువనిత. ఇల్లిల్లూ తిరిగి ఖాదీప్రచారంచేసిన అన్నపూర్ణ  గారి తండ్రి కలగరరామస్వామి తల్లి పిచ్చమ్మ!పిన్ని బొప్పన మాణిక్యాంబ ప్రోత్సాహంతో ఆంగ్ల విద్యను అభ్యసించింది. ఆమె రచయిత్రిగా రాణించింది."నవవర్షస్వప్నం,వివాహ మంగళం, అరవిందుని లేఖలు" బెంగాలీ భాష నుంచి తెలుగులోకి అనువదించిన విదుషీమణి!కలకత్తాలోని బ్రహ్మ బాలికా విద్యాలయంలో చదివిన  అన్నపూర్ణ  ఆంగ్లంలో  టకటకా మాట్లాడి అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచేది. కానీ పిన్న వయసులోనే ఆమె మరణించటంతో ,ఆమెభర్త బాధ తో గాంధీజీతో" ఎక్కువ పనివత్తిడిలో  నాభార్య అన్నపూర్ణ చనిపోయింది" అని నిష్ఠూరంగా అంటే గాంధీజీ బాధతో , ఇలా రాశారు," నాప్రియకుమార్తె లోకాన్ని వీడింది. పేరు బహుమతుల కోసం ఆమె దేశ సేవ చేయలేదు.నా దుఃఖాన్ని మాటల్లో వర్ణించలేను"🌹

కామెంట్‌లు