*డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh
*
బెన్నూరి కృష్ణవేణమ్మ గారు1896 లోజన్మించారు.భర్త శ్రీ బి.వి.ఎన్.రామారావు. ఆమెతల్లిదండ్రులు జి.మనోహరరావు పంతులు, లక్ష్మీబాయమ్మగార్లు.అందరికీ తల్లో నాలుక, పరోపకారి పాపమ్మ. ఆఖరితమ్ముడు మాధవరావు ప్రోత్సాహంతో రాజకీయాల్లో దూకారు ఆమె.కూతురిబడిలో హిందీ చదివి మిగతాస్త్రీలకి హిందీ బోధించేవారు. గాంధీజీకి 11ఏళ్ల కూతురు తన చేతిబంగారు గాజులు విరాళంగా ఇస్తే పల్లెత్తిమాట అనని కన్నతల్లి!ఖాదీ ప్రచారం నూలు వడకటం హిందీ నేర్పటంలో ఆమె తలమునకలయ్యేవారు. రాజమండ్రీలో హిందీటీచర్ గా స్థిరపడి కుట్లు అల్లిక,ఎంబ్రాయిడరీలో ఆడవారికి తర్ఫీదు ఇచ్చారు.దేశసేవికాసంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆమెపై 5రు.ఫైన్ తో పాటు18జనవరి1932లో వెల్లూర్ కన్ననూర్ లో కఠిన కారాగారశిక్ష అనుభవించారు
ఆమె.వెల్లూర్ సి.క్లాస్ జైల్లో ఖైదీలకు ఇసుక పై హిందీ అక్షరాలు నేర్పారుకాశీనాథయ్య నాగేశ్వరరావు పంతులుగారు పుస్తకాలు, సూదులు దారాలు ఇప్పించారు.జైల్లో హిందీ పరీక్షలు నిర్వహించేందుకు పర్మిషన్ పొందిన ఆమె కొన్నాళ్ల కు పిల్లల చదువుల కోసం రాజమండ్రీలో స్థిరపడ్డారు.వైశ్యసేవాసదనంలో హిందీ నేర్పారు.ఆమె విద్యార్థిని ఊటుకూరి లక్ష్మికాంతమ్మ గారు.ఆతర్వాత మద్రాస్ లో ఆంధ్ర మహిళాసభ లోహిందీనేర్పారు. ఆమె ఇల్లంతా రాజకీయ నేతలతో కిటకిట లాడేది. పోలీసులంతా మఫ్టీలో కాపలా కాసేవారు. మద్రాస్ లో మహిళలతో ప్రభాతభేరీలు, నగర సంకీర్తనలు నిర్వహించి రిక్షావాడి వాహనంలో వెల్తూతనకి కులభేదం లేదని నిరూపించింది. ఒక నేరగాడు ఆమె ఇంట్లో పనివాడిగా ఉండి రోజూ పోలీసులకు రిపోర్ట్ చేసేవాడు.7మార్చి 1965 లో ఆమె కన్నుమూశారు.ఆమె ఎవరో కాదు,దుర్గాబాయిదేశ్ముఖ్ గారితల్లి.
మానాప్రగడ రామసుందరమ్మ ఖండవల్లిలో పుట్టారు.తండ్రి కనకయ్య,భర్త కృష్ణారావు. భర్త తో ఆమె సీతానగరం ఆశ్రమంలో ఉంది. ఆంధ్రాప్రొవెన్షియల్ ఉమెన్ డిక్టేటర్స్ కాన్ఫరెన్స్ లో (గుంటూరు) పాల్గొని2000రూ.ఫైన్ 6నెలల వెల్లూర్ కన్ననూర్ జైలుశిక్ష అనుభవించారు.కాంగ్రెస్ కార్యకర్త గా సేవ లందించిన ఆమె టి.బి.తో 1936లో మరణించారు.భమిడిపాటి రంగనాయకమ్మ కాకినాడ నివాసి.ఆమె తండ్రి వెంకట్రామయ్య.5రూ.ఫైన్ తోపాటు వెల్లూర్ కన్ననూర్ జైలుశిక్ష అనుభవించిన నారి.రాజమండ్రికి చెందిన శివరాజుసుబ్బమ్మ భర్త డా.ఎస్.వి.రామారావు.వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన మగువ🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి