మరుగున పడిన మగువలు29:-అచ్యుతుని రాజ్యశ్రీ

 *డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh 
కంభంపాటి మాణిక్యాంబ గారు1917లో తొండవరంలో  సుభద్రమ్మ సుబ్రహ్మణ్యశాస్త్రి దంపతులకు జన్మించారు.విజయవాడ కి చెందిన  సత్యనారాయణ గారు ఆమె భర్త. తొలుత కాంగ్రెస్ లో ఉన్న ఆదంపతులు కమ్యూనిస్టులుగా మారారు.భర్త ఉన్నతవిద్యావంతుడుకావటంతో  పుస్తకాలు భార్య చేత చదివించేవారు.ఎం.ఎ.రెండవ సంవత్సరం చదువుతున్న ఆయన  తొలుత గాంధీజీ ప్రభావంతో  చదువాపేసి జైలుశిక్ష అనుభవించారు.14ఏళ్ల మాణిక్యాంబ  ఇతరులతో కల్సి పికెటింగ్ లో పాల్గొన్నది.చిన్న పిల్ల ఐనా ఏలూరు సబ్ జైల్లో ఉంచారు ఇంకొంతమందితో 15రోజులు! పోలీసులు కాంగ్రెస్ వారి దుస్తుల్లో వచ్చి ఎన్నోవిధాల వారినుంచి సమాచారం రాబట్టాలని చూసి విఫలులైనారు.  భీమవరంలో శిక్షణ పొందుతున్న ఈచిన్నారిని  తిరిగి అరెస్ట్ చేసి కొవ్వూరు సబ్ జైల్లో ఉంచారు.ఆమె భయపడకుండా రెట్టించిన ఉత్సాహంతో ఆందోళనలో పాల్గొన్నది.16వ ఏట  అరెస్టయిన ఆమెనువెల్లూర్ జైల్లో 6నెలలుంచారు.అక్కడ ఆమె మార్గరెట్ కజిన్స్ ఇంకా ప్రముఖ మహిళలను కలవటం జరిగింది.భార్యాభర్తలిద్దరూ దేశంకోసం అష్ట కష్టాలు పడ్డారు.1936లో కాంగ్రెస్ విజయంకోసం పోరాడారు. కోటనందూర్ సీటు కాంగ్రెస్ కి దక్కింది. ఆతర్వాత మాణిక్యాంబ డాక్టర్ బండారు అచ్చమాంబ తో కల్సి మహిళల హక్కులు, పెళ్లి విడాకులు,దేవదాసీ ఆచారం,బహుభార్యాత్వం,కి వ్యతిరేకంగా పోరాడింది.రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏయిర్ రైడ్ ప్రికాషన్స్ (ARP ) లో శిక్షణ పొంది ఇతరులకు శిక్షణ  ఇచ్చింది.ఎస్ సుభద్రమ్మ తండ్రి రామయ్య చారి కాకినాడ నివాసి విద్యార్థిగా ఈమె ఉద్యమంలో పాల్గొని 1932లో వెల్లూరు మద్రాసు జైలు శిక్ష అనుభవించింది. పాలకోడేటి శ్యామలాంబ రాజమండ్రి నివాసి 12 జూన్ 1902 లో జన్మించింది తండ్రి దుగ్గిరాల వియ్యన్న. భర్త సూర్యప్రకాశరావు ఏడు నెలల జైలు శిక్ష వెల్లూరులో 1932లో విధించడంతో ఎన్నో కష్టాలు పడింది ఆమెకాకినాడలో 1919లో సుగుణ మణి జన్మించారు తండ్రి వెంకటస్వామి ఆయన అనాధలు హరిజనుల కోసం పాటుపడ్డారు సుగుణమణిపై రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం పడింది ఆమె భర్త కె భూషణం ఆమె గృహలక్ష్మి లో స్త్రీలకు సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాశారు 1944లో భర్తకి మద్రాసులో ఉద్యోగం కావడంతో ఆంధ్ర మహిళా సభలో చేరి 1937లో ది లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు దుర్గాబాయి దేశ్ముఖ ఆమె తల్లి కృష్ణ వేణమ్మ ప్రోత్సాహంతో 19 34 లో 15 ఏళ్ల సుగుణ బీహార్ భూకంప బాధితులకు నిధులు సేకరించింది తన ఎనిమిదవ ఏటా దుర్గాబాయిని బులుసు సాంబమూర్తి మొదలైన పెద్దలని వారి దేశభక్తిని చూసి ఆ మార్గంలోనే ఆమె నడిచింది🌷
కామెంట్‌లు