డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh
యామినీ పూర్ణతిలకం కళావంతులకుటుంబానికి చెందిన ఆమె .పెళ్లిలో వీరి గానాబజానాలుండేవి.కానీ కందుకూరి వీరేశలింగంపంతులుగారి పుణ్యమా అని వీరిజీవితాల్లో కొత్త మార్పు వచ్చింది.రఘుపతివెంకటరత్నం నాయుడిగారి చేయూత తో ఆకులంలోని వారంతా తమజీవితాలని మార్చుకొనే ప్రయత్నం చేయటంలో యామిని ఓలీడర్ గా ఎదిగారు. బాల్యంలోని చేదు అనుభవాలని రుచిచూసిన ఆమె తమ పిల్లల కి పెళ్లి పేరంటం కావాలని గృహిణిగా మంచిమార్గంలో నడవాలనే ఉద్దేశంతో గాంధీజీ అండదండ లతో ముందడుగు వేసింది.ఆమెకి దర్శి చెంచయ్య గారి ప్రోద్బలం లభించటంతోచకచకపావులు కదిపింది.యామిని అనర్గళంగా మాట్లాడేది. మంచి పండితురాలుకూడా! గాంధీమార్గం ఖద్దరు తెలుగుసాహిత్యంపై అడయారులోని నేషనల్ యూనివర్శిటీలో తన ఉపన్యాసాలతో జనాల్ని ఉర్రూతలూగించారు.కళావంతుల రిఫామ్ అసోసియేషన్ ని నెలకొల్పి తన పెద్ద కూతురితో కల్సిమీటింగ్స్ ఏర్పాటుచేశారు.తమసమస్యల్ని గూర్చి న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ లో రాయటం,శరణాలయాలు నెలకొల్పటం చేశారు.దర్శి చెంచయ్య గారు ఆర్ధిక సాయంచేశారు.ఆంధ్రాప్రాంతాల్లో ఆమె పర్యటించి కాశీనాధుని వారి ఆంధ్ర పత్రిక లో వ్యాసాలు రాశారామె. తనే స్వయంగా హిందూ యువతి అనే పక్షపత్రికను నడిపారు.గుంటూరు,నరసాపురంలో కళావంతులంతా ఏకమై తమ భావాల్ని స్పష్టంగా విప్పిచెప్పారు.1922లో మద్రాస్ లో హిందూ యువతి శరణాలయంని నెల కొల్పి ఇంటినుంచి పారిపోయివచ్చిన అమ్మాయిలకి ఆశ్రయం కల్పించారు.వారికి నూలువడకటం,నేత,టైలరింగ్,బుట్టల అల్లకంలో శిక్షణ ఇప్పించారు.దుర్గాబాయమ్మ తో కల్సి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యామినీ పూర్ణతిలకం దేవదాసీల జీవితాల్లో వెలుగునింపిన మహిళామణి.మరుంగంటి లక్ష్మీనరసమ్మ గారి భర్త గొప్ప దేశ భక్తుడు.ఆయన పేరు లక్ష్మీనరసింహాచారి. ఈమె అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నది.దేశ భక్తి గేయాలు పాడుతూ ఖద్దరు ప్రచారం చేశారు.జైలుకెళ్లలేదు.తన కొడుకులకు ఆమె సత్యగ్రహాచారి,పతాకాచారి అని పేర్లు పెట్టారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి