మరుగున పడిన మాణిక్యాలు4: అనువాదం...అచ్యుతుని రాజ్యశ్రీ

 ( డాక్టర్ కె.జానకి  గ్రంథం "రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ 1999 ఆధారంగా)
శాంత కుమారి అసలుపేరు శృతిమాల.పంజాబీ పడతి ఐన ఈమె అమృత సర్ నివాసి.ఆమె భర్త పండిట్ మదన్ మోహన్ విద్యాసాగర్ ఆర్యసమాజ్ కి చెందిన వ్యక్తి కావటంతో1939లో ఆదంపతులు విశాఖ పట్టణం,ఆపై విజయవాడ, తెనాలి లో ఉండి ఆఖరున  హైదరాబాద్ లో స్థిరపడ్డారు.శాంతకుమారి తండ్రి జ్ఞాన చంద్! క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె భర్త తో తెనాలిలో ఆర్యసమాజపనులలో చురుగ్గా పాల్గొన్నది.రాజకీయ నాయకులంతా ఆమె ఇంట్లో సమావేశమయ్యేవారు. క్రమంగా ఆమె దేశ స్వాతంత్య్ర పోరాటంలో కమల మోపలూరు అన్నపూర్ణ,కూచిపూడి ఉష మొదలైన మహిళల తో కల్సి పోరాడింది. తెనాలికోర్టు ముందు పికెటింగ్ చేసి అరెస్టయిన ఆమెకు కఠిన కారాగారశిక్ష విధించి వెల్లూర్ జైల్లో బంధించారు.1942 లో 16సెప్టెంబర్ లో శిక్ష అనుభవిస్తున్న ఆమె ఆదర్శ నారిగా నిలబడింది.
కృష్ణా జిల్లాకు చెందిన ఇర్నేని అమృతమ్మ 1942 _43లో  మూడుసార్లు వెల్లూర్ లోజైలుశిక్ష అనుభవించారు.🌹
కామెంట్‌లు