మరుగున పడిన మగువలు- 6: - సేకరణ....అచ్యుతునిరాజ్యశ్రీ

 (డా.కె.జానకిగారి గ్రంథం ఆధారం)
కృష్ణాజిల్లా కి చెందిన ఎందరో మహిళలు స్వాతంత్య్ర సమరంలో పోరాడి వెల్లూర్ లో కఠిన కారాగారశిక్ష అనుభవించారు. వారినిగూర్చిన పూర్తి సమాచారం దొరకటం కష్టమైనా వారి పేర్లు తెలుసుకుని ఆనందిద్దాం. నాదెళ్ల రంగమ్మ,  గోళ్లమూడి రత్నమ్మ 6నెలల కఠిన కారాగారశిక్ష వెల్లూర్ లో అనుభవించారు.లైబ్రరీ ఉద్యమం ,హరిజన సంక్షేమంకై రత్నమ్మ విశేష సేవలందించారు.పండితారాధ్యుల సత్యవతమ్మ రేపల్లెవాసి.తండ్రి శ్రీరాములు,భర్త  హనుమంతరావు.పెనుమర్తి శేషమాంబ ఆనాటి తెనాలి తాలూకాకు చెందిన పోటుమర్రు నివాసి.తండ్రి మంత్రవేది లక్ష్మయ్య.హిందీ ప్రచారం చేశారామె.పత్తిపాటి సీతమ్మ 23సెప్టెంబర్ లో 1942లో  వెల్లూర్ జైలుశిక్ష అనుభవించిన మగువ.చేబ్రోలు కి చెందిన దేవభక్తుని సీతారామమ్మ తండ్రి మాధవయ్యగారు. 1944లోలోకల్ గరల్స్ నేషనల్ స్కూల్లో చదువుతున్నప్పుడు, స్వాతంత్య్ర దినోత్సవం జరిపిందనే నెపంతో 300రూపాయల ఫైన్ తో పాటు అరెస్టయినదేశభక్తురాలు.కాజా సౌభాగ్యమ్మ కి 15 నెలల జైలుశిక్ష విధించినది బ్రిటిష్ సర్కారు.సీతంరాజు సీతారామమ్మ3మార్చి 1920 లో వెంట్రప్రగడ గ్రామంలో(గుడివాడ తాలూకా) పుట్టారు.ఆమె తండ్రి ముళ్లపూడి వెంకటేశ్వర రావుగారు.సుబ్బారావు గారు ఆమె భర్త  .విజయవాడ లో స్థిరపడిన ఆమెకుక్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను 200రూపాయల ఫైన్ తో జైలుశిక్ష వేస్తే,ఆమె ఫైన్ కట్టనని నిరాకరించింది.వెల్లూర్ లోజైలుశిక్ష అనుభవించిన మహిళ !1945లోనేకృష్ణాజిల్లా మహిళాసంఘంకి జాయింట్ సెక్రటరీ గాపనిచేశారు.1947_55దాకా విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ గా,1954_55దాకా జువెనైల్ కోర్ట్ మాజిస్ట్రేట్ గా, 1973 లో కృష్ణాజిల్లా ఫ్రీడం ఫైటర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం  ఆమె ప్రతిభ సామర్ధ్యానికి మైలు రాళ్లు.చోడవరంకి చెందిన మద్దాలి వెంకట సుబ్బమ్మ తండ్రి గౌరినేని వెంకట రామయ్య.భర్త వెంకటేశ్వర రావు ప్రోత్సాహంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 200రూపాయల ఫైన్ కట్టింది.1944లో వెల్లూర్ లోజైలుశిక్ష అనుభవించారు.ఇక భర్త కూడా 4సార్లు జైలుశిక్ష కి గురైనారు🌹
కామెంట్‌లు