మరుగున పడిన మగువలు 6:- సేకరణ....అచ్యుతునిరాజ్యశ్రీ

 (డాక్టర్.కె.జానకిగారి పుస్తకం"రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 1999ఆధారం)
వెల్లూర్ జైలుశిక్ష అనుభవించిన కొందరు నారీమణులలో నాదెళ్ల రంగమ్మ ఒకరు.ఈడ్పుగంటి వెంకట రత్నమ్మ విజయవాడ తాలూకా( ఆనాడు) పెనమకురునివాసి. తండ్రి వేనుల దశరథరామయ్య, ఆమె భర్త కోదండరామయ్య.  ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం వర్కింగ్ కమిటీ మెంబర్ గా,జిల్లా బోర్డు మెంబర్ గా, ఆంధ్ర స్టేట్  కాంగ్రెస్ అసెంబ్లీ  ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ గా,ఆంధ్ర స్టేట్ రైతుసంఘం వైస్ ప్రెసిడెంట్ గా,ఆంధ్ర మహాజనసభ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా,కృష్ణ జిల్లా మహిళాసంఘం సెక్రట్రీగా, పెనమకురు గ్రామ పంచాయతీ  ప్రెసిడెంట్ గా తన పల్లెకు  సేవలందిస్తూ 1943లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుశిక్ష  అనుభవించారు.కోయా వెంకట నర్సమ్మ 2జూన్1895లో 
 జన్మించారు.కొనకంచివాసి. తండ్రి మాదాల పరంధాముడు. భర్త వెంకట రామయ్య. క్విట్ ఇండియా ఉద్యమంలో సబ్ జైల్లో ఉన్నారు.ఉప్పల జోలింగర్ కి 750రూపాయల ఫైన్,6నెలల జైలుశిక్ష విధింపబడింది. మోపర్రుకి చెందిన కల్లూరు తులశమ్మ తండ్రి కొడాలి కృష్ణయ్య.భర్త రంగయ్య. 16నెలల జైలుశిక్ష  అనుభవించిన వీర నారీమణి.ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ తీసుకోలేదామె!ఖాదీ ప్రచారం,ఖాదీ అమ్మకంతో జీవితంగడిపిన త్యాగశీలి! గాంధీజీ వినోబాజీని ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలామె.అరమందల ఉషాదేవి 15నెలల శిక్ష అనుభవించి 1946లో స్వర్గస్తులైనారు.రావెళ్ల వెంకాయమ్మ  15నెలల శిక్ష వెల్లూర్ లో అనుభవించారు.వాసిరెడ్డి అఖిలాండేశ్వరి కి
16నెలల కఠిన కారాగారశిక్ష  విధింపబడింది.15 ఆగస్ట్ 1972 లో భారత ప్రభుత్వం ఆమెను తామ్రపత్రంతో సత్కరించింది🌷
కామెంట్‌లు