మరుగున పడిన మగువలు-8:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 డా.కె.జానకిగారి పుస్తకం*రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్1999ఆధారం)

ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మహిళామణులగూర్చి తెల్సుకుందాం.గడ్డం లక్ష్మీదేవి కె.సుబ్బారెడ్డిగారి కుమార్తె.క్విట్ ఇండియా ఉద్యమంలోపాల్గొని15ఫిబ్రవరి1943 లో అరెస్టయినమగువ.వెంకటగిరికి చెందిన  కావేటి రామతిలకమ్మ,కావలి కిచెందిన పి.డి. సామ్రాజ్యం,వెంకటగిరి కి చెందిన  చెల్లా సరోజిని చెప్పుకోదగ్గ వారు.
ఇక విశాఖ పట్నం ప్రాంతానికి చెందిన  కొడుకుల కామేశ్వరమ్మ  అనకాపల్లివాసి. ఆమెతండ్రి సూర్య నారాయణ కూడా ఫ్రీడంఫైటర్! శిష్ట్లా లక్ష్మీనరసమ్మ  ఎలమంచిలి ప్రాంతంలోని దిమిలివాసి. ఆమె భర్త పురుషోత్తం కూడా ఫ్రీడంఫైటర్! శిష్ట్లా లింగమ్మ  వెల్లూర్ లోజైలుశిక్ష అనుభవించారు.ఇక 1949లో మరణించారు.కలందభట్ల మహలక్ష్మమ్మ జైలుశిక్ష అనుభవించి తన 76వ ఏట 1967 లో తుదిశ్వాస విడిచారు.ఆనాటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిష్ట్ల శ్యామసుందరమ్మ  బొద్దన్ లో జన్మించారు.దిమిలివాసి రామదాసుతో ఆమె పెళ్లి జరిగినది.4వక్లాస్ వరకే చదివిన ఆమె1942లో  జైలుశిక్ష అనుభవించినది.వీరంతా ఆనాటి నెల్లూరు,విశాఖపట్నం కి చెందిన వారు🌷
కామెంట్‌లు