ఆకాశవాణి సమాచారం8: - సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
 
డా.నాగసూరివేణుగోపాల్ సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
శ్రీనాగసూరి గారు సూటిగా ఓమాట చెప్పారు" అవసరమే అన్వేషణకు  ఆవిష్కరణ కు దారితీస్తుంది. 2002 జనవరి 4 నుంచి ప్రతిశుక్రవారం ఉదయం15 నిముషాలు ప్రసారమైన సాహితీదర్పణం 13వారాలు పాటు అందరినీ అలరించిన ప్రోగ్రాం.ఇక్కడ ఓఆసక్తికరమైన సంఘటన చెప్పారు వేణుగోపాల్ గారు.2001లోశ్రీ పరుచూరుశ్రీనివాసరావుగారు కోలవెన్ను అనే గ్రామంనుండి వచ్చి తన గురువుగారైన శ్రీజి.వి. కృష్ణారావుగారిని గూర్చి ప్రస్తావన తెచ్చారు.గవిని వెంకట కృష్ణారావుగారు 1963_1973 ప్రాంతంలో విజయవాడ ఆకాశ వాణిలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.శ్రీగుంటూరు రఘురాంగారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్.శ్రీ జి.వి.గారు1914 నవంబర్ 15 న కూచిపూడిలోపుట్టారు.ఆయన మిత్రులు సర్వశ్రీ చక్రపాణి,కొడవటిగంటి, గోపీచంద్ మొదలైనవారు.బెనారస్ హిందూయూనివర్శిటీలో ఎం.ఏ.ఇంగ్లీష్ చదివి పరీక్ష రాయలేదుకానీ 1951 లో ఆయన రాసిన కీలుబొమ్మ నవల,కళాపూర్ణోదయం కావ్యాన్ని ఆంగ్లంలో విశ్లేషించి పింగళిసూరనను ప్రపంచ స్థాయి సాహితీవేత్త గా నిలపటం మద్రాసు యూనివర్శిటీ డాక్టరేట్ ఇవ్వటం నిజంగా గర్వించదగిన విషయం!శ్రీ జి.వి.గారు సంస్కృత కాలేజీ ప్రిన్స్ పాల్ గా,ఆపైరేడియోలో ప్రొడ్యూసర్ గా చేశారు.ఆయన మొత్తం రచనలు 7సంపుటాలుగా వచ్చాయి. వీటిలో విషయాన్ని నాగసూరిగారు 11 టాపిక్స్ గా సిద్ధంచేయటం,విజయవాడ ఆకాశవాణి సమ్యక్ వీక్షణంపేరుతో2002లోజనవరి,ఫిబ్రవరి,మార్చిలో ప్రసారంచేయటం జరిగింది.2013_14 లో జి.వి.గారి శతజయంతి సందర్భంగా ,ఆయన సాహిత్య సమాలోచన సాహితీచైత్రరథం పునర్ముద్రితంకి శ్రీవేణుగోపాల్ గారు ముందుమాట రాయటం ఆనందం కలిగించిన విషయం అని పేర్కొన్నారు.2018లోహైదరాబాద్ ప్రసారభారతి శిక్షణాకేంద్ర నిర్దేశకులుగా పనిచేశారు.2019లో ఆకాశవాణి హైదరాబాదులో గాంధీజీ 150వ జయంతికి చాలా కొత్త కార్యక్రమాలు చేయటం తృప్తినిచ్చింది.మధురై కామరాజ్ యూనివర్శిటీలో ఎం.ఏ.జర్నలిజం చేయటంలో అబ్దుల్ ఖుద్దూస్ గారి సలహా ఉపయోగపడింది. ఆయన ఇష్ట పడి చేసిన వ్యవసాయ దారులప్రోగ్రాం,ప్రముఖులతో ప్రతినెలా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం,"మీతో ఆకాశవాణి" ఇలా ఎన్నెన్నో ఆయన  ఖాతాలో ఉన్నాయి🌷

కామెంట్‌లు