హేళన:- పవిత్ర -తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్- మెదక్ జిల్లా-90002 00915
  అనగనగా తూప్రాన్ అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో భీమయ్య, చంద్రమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు సీత, గీత అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారికి ఆటలు ఆడుకోవడం అంటే ఇష్టం ఉండేది. 
        ఆటలలో వాళ్ళు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి, అవార్డులు పొందారు. అక్క చెల్లెళ్ళు చదువులో వెనుకబడి ఉన్నారు. పాఠశాలలో స్నేహితులు వాళ్లకు చదువు రాదని, హేళన చేసేవారు. ఒకరోజు బాగా దిగులుతో ఉన్న సీత, గీతలను మధు మాస్టర్ గమనించి, వారితో కాసేపు మాట్లాడి, ఎంతో శ్రమపడి జాతీయస్థాయి క్రీడలలో మీరు పాల్గొంటున్నారు. ప్రతిభ కనబరుస్తున్నారు. అలాంటిది ఇంటి దగ్గర ఉండి కష్టపడి, మీరు చదువుకోలేరా! అంటూ సూచన చేశాడు.
         సీత, గీతలు బాగా ఆలోచించారు. మధు మాస్టర్ చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, బడిలోనే కాకుండా ఇంటి వద్ద కూడా రాత్రి పూట బాగా చదువుకుని, నెల రోజుల్లోనే చదువులో కూడా ముందు వరుసలో చేరారు. హేళన చేసిన విద్యార్థులు ఆశ్చర్యపోయారు. విద్యార్థులు ఆటలు, చదువుల్లో అన్నింటా ముందుండాలని సీత, గీతలను చూసి ముందుకు సాగుతున్నారు.

నీతి: ఆపదలో ప్రోత్సహించే వారే నిజమైన గురుగులు



కామెంట్‌లు