1.అమ్మ నవమాసాల శ్రమ,మన ఈ మానవ జన్మ!అయ్యపడే శ్రమంతా,మనకోసం చేసే సత్కర్మ!అయ్యగారి శ్రమ మనల్ని ,తీర్చిదిద్దే నిష్కామ కర్మ!ఎంతోమంది శ్రమ మనం,తీర్చలేని ఋణమేనమ్మా!శ్రమ మరువని జన్మ,తప్పక సార్ధకమగునమ్మా!2.పక్షి చక్కని గూడు కడుతోంది!తేనెటీగ తేనె కూడ పెడుతోంది!చీమ అలసట లేక నడుస్తోంది !చేపనీటిలో ఈది బతుకుతోంది!గాడిద పెద్దబరువైనా మోస్తోంది !3.భూమి తన చుట్టూ తాను,తిరుగుతోంది నిత్యం!శ్రమ అనుకోక సూర్యుని ,చుట్టూ తిరుగుతోంది సత్యం!మరగడం తెలిసిన నీరు,ఆవిరై నింగి చేరుతోంది!ఆగడం తెలియని గాలి,విశ్వమంతా ప్రాణం పోస్తోంది!పెరగడం తెలిసిన మొలక,మానుగా ఎదిగి నిలుస్తోంది!4.ఒక్కో అక్షరం దిద్దితే చదువు!ఒక్కో మెట్టు ఎక్కీతే పరువు!పట్టుపడితే బతుకు సులువు!శ్రమ మానవ జీవన క్రతువు!లోకాన రాదు మరి ఏ కరువు!_________
శ్రమే!: -డా పివిఎల్ సుబ్బారావు ,-విజయనగరం .-94410 58797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి