1.అమ్మ గర్భంలోనే ఆరంభం,బయటకు రావాలని!వచ్చిన దగ్గర నుండి,సమారంభం ఎలా బతకాలని!ఎవ్వరూ స్వాతంత్రం ఇవ్వరు,నీవే సాధించుకోవాలని!మార్గం వేసి ఉండదు,నడిచే దారి నిర్మించాలని!నడవనివ్వక వెనక్కి ,లాగే వాళ్లని ,తోసి రాజనలాని!2.పగలు రాత్రి అనక ,విరామం,లేని సముద్ర హోరు!ఎదురుగా ఉదయించే ,సహస్రకిరణాల సూర్యుడితీరు!నింగి నుండి ,కుండ పోతై,కురిసే చినుకుల జోరు!తెల్లవారగనే కూడు కోసం,ఎగిరే ఆ పక్షుల బారు!సాగరం చేరే దాకా,నదీ,ప్రవాహ పరవళ్ల చైతన్య సౌరు;3.అనుకున్నది పొందాలంటే,అహర్నిశలూ జ్వలించాలి!సింహానివే ,ఏది గుహదగ్గరికి,రాదు, బయటకొచ్చి వేటాడాలి!విజేయుడివే ,విషాదం వీడు,విల్లు చేపట్టి, ధర్మం నిలబెట్టాలి;నిన్ను నిరూపించుకోవాలంటే,ముందుకు ఊరికే తీరాలి !జీవనం పోరాటం, తెగింపు,కావాలి ,సంకెళ్లు తెగాలి!4.ఓ పార్ధుడా, యోధుడా, క్షుద్రం,హృదయ దౌర్బల్యం, తెలియాలి!పోరాటంలో గెలిచావు, ఇంకేమి,ఆశయ సిద్ధి, ఆయువృద్ది!మరణించావు, వచ్చేది విశేషకీర్తి,ఇచ్చేది భావితరాలకు స్ఫూర్తి!నీవు మరణించినా ,సిద్ధాంతం ,బతకాలి, మార్గాలు జీవించాలి!అస్తవ్యస్త సమాజాన, పోరాటమే, సమవర్తి,న్యాయమూర్తి!_________
పోరే!: - డా. పివిఎల్ సుబ్బారావు, విజయనగరం, 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి