మనిషి సర్వస్వం మనసే!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797

( మనసు కవి ,ఆత్రేయ జయంతి) 

నా పంచపదుల సంఖ్య-----
              2216-2217.

2216.
  మన ఏవ మనుష్యాణాం,
సృష్టిలో మనిషికే మనసు! 

మనం ఏమిటో ?ఎవరో? 
మనసుకు మాత్రమే తెలుసు! 

దగ్గరైతే స్నేహితుడు,
దూరం చేస్తే శత్రువే మనసు! 

కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల,
అధిపతి ఈ మనసు! 

ప్రపంచం కాదు మనసు ,
జయిస్తే ,నీవే, అలగ్జాండర్, 
పివిఎల్!

2217.
మనసు వశమవ్వడం 
మనిషికి అతి దుర్లభము!

అభ్యాస, వైరాగ్యాలతో ,
మనిషికి తప్పక సాధ్యము! 

మనసు దైవం వైపు తిప్పాలి,  
 శరణాగతే మార్గము!

మనిషీ! భజగోవిందం, 
మనసు మరి మన వశము,
పివిఎల్!
_________'
.

కామెంట్‌లు