సర్వ మతాలకు దేవుడు ఒక్కడే !: - గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
 మన సిద్ధ గురువులచే ఈ ప్రపంచంలో ఉద్భవించిన మతాల అన్నింటికీ దేవుడు మాత్రం ఒక్కడే అన్నది సత్యం. సర్వసిద్ధ గురువులు ముక్తకంఠంతో ఆమోదించినదే ఈ పరమ సత్యం
నదులకు రారాజు సముద్రమైనట్లు, అడవి మృగాలకు రారాజు సింహమైనట్లు, గ్రహాలకు రారాజు సూర్యుడైనట్లు సర్వ మతాలకు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే మన పరమశివుడు.
హైందవ మతం--------పరమశివుడు అన్నది.
జొరాష్టీయన్ మతం-------అహురా మజ్.దా అన్నది.
యూదు మతం------జెహోవా అన్నది.
క్రైస్తవ మతం-------పరలోకపు తండ్రి అన్నది.
ఇస్లాం మతం------అల్లా హ్ అన్నది.
బౌద్ధమతం-----శూన్యం అన్నది.
జైన మతం------మోక్ష అన్నది.
సిక్కు మతం-----హరుడు అన్నది.
మెక్సికో మతం------క్విట్.కాట్లో అన్నది.
చైనా మతం-----పాన్ కు అన్నది.
స్కాండినేవియా మతం-----యీమీర్ అన్నది.
బాబిలోనియా మతం-----అట్లాటెంట్లే అన్నది.
ఈజిప్టు మతం------ఖ్నుపూ అన్నది.
ఈ విధంగా విభిన్న మతాలు, విభిన్న నామాలతో కీర్తించబడిన దైవం ఒక్కడే. అదేవిధంగా విభిన్న మతాల సిద్ధ గురువులు కొనియాడిన దైవం కూడా ఒక్కడే.
  సర్వ మతాల సిద్ధగురువులు
----------------------------------------
హైందవ మత గురువు ---ఆదిశంకరాచార్యులు.
జొరాస్ట్రియన్ మత సిద్ధ గురువు----జొరాష్ట్రర్.
యూద్.మత సిద్ధ గురువు.----మోజస్.
క్రైస్తవ మత గురువు-----జీసస్.
ఇస్లాం మత సిద్ధ గురువు-----మహమ్మద్ ప్రవక్త.
బౌద్ధ మత సిద్ధ గురువు-----బుద్ధుడు.
జైనమత సిద్ధ గురువు-----మహావీరుడు.
సిక్కు మత సిద్ధ గురువు----గురు నానక్.
హాయ్ సిద్ధ గురువులు అందరూ సూచించిన దేవుడు ఒక్కడే.
అందుకే మహా పండితుడైన బాలగంగాధర్ తిలక్ అందరి దేవుడు ఒక్కడేనని ఒక నిగూఢ రహస్యాన్ని బహిర్గతం చేశాడు.
అలాగే క్రైస్తవ మతానికి, ఇస్లాం మతానికి మూల దైవం జెహోవా.
ఈ జెహోవా ఎవరో కాదు మన ఋగ్వేద మంత్రాలలో కీర్తించబడిన యెహోవా అనే దైవమే అన్నారు బాలగంగాధర్ తిలక్
యెహోవా అంటే నిరాకార పర దైవమని అర్థం. ఏకైక నిరాకార పరదైవం ఎవరు? పరమశివుడు అన్నది జగమెరిగిన సత్యం. ఈ ఒక్క దేవుడినే రకరకాల మతాలు, రకరకాల నామాలతో పిలిచాయి. విభిన్న నామాలతో కొలిచాయి. ఈ పరమ సత్యాన్ని గ్రహించలేక మత చాదస్తంతో, మతమౌఢ్యముతో, మత దురభిమానంతో ఒక మతం వాడు మరొక మతం సంస్కృతిని సర్వనాశనం చేశారు. ఒక మతం వారు మరొక మతం ప్రజలను సంహరించారు. ఘోరాతి ఘోరంగా దుఃఖాన్ని కలిగించారు. ఈ భయంకర అజ్ఞాన అవివేకానికి కారణం ఏమిటి? సర్వ మతాల దేవుడు ఒక్కడే అని
 గ్రహించకపోవడమే
అందరూ జీవించే నేల ఒకటే.
అందరూ త్రాగే నీరు ఒకటే.
అందరూ వినియోగించే అగ్ని ఒక్కటే.
అందరూ పీల్చే గాలి కూడా ఒక్కటే.
అందరూ ఆనందించే ఆకాశం కూడా ఒక్కటే.
అందరూ అనుభవించే ప్రకృతి కూడా ఒక్కటే.
ఇలా పై పంచభూతాలు అందరికీ ఒకటే అయినప్పుడు, ఆ పంచభూతాలను సృష్టించిన దేవుడు అనేకం ఎలా అవుతాడు?
అదే మనిషి యొక్క అజ్ఞానం. అవివేకం. కాబట్టి దేవదేవుడు, మహా ప్రభువు, అందరి దేవుడు ఒక్కడే అని చక్కగా గ్రహించు.
సర్వ మతాలను గౌరవించడం నేర్చుకో. తన మతాన్ని గౌరవిస్తూ, ప్రేమిస్తూ పరమతాలను ద్వేషించేవాడు అధముడు.
తన మతాన్ని ప్రేమిస్తూ, పరమతాలను గౌరవించేవాడు ఉత్తముడు. అని గ్రహించు. నీవు ఆచరించు .అందరితో కలిసిమెలిసి జీవించు. జీవించి ఇలలో శాశ్వతంగా తరించు.

కామెంట్‌లు