దారి తప్పిన పిల్లలం
నోరు విప్పిన మల్లెలం
మేం విద్యలేని వారలం
సయోధ్య ఉన్న పోరలం !
ఆస్తిపాస్తులు లేకున్నా
మస్తుగా సుస్థి చేస్తున్నా
చదవాలని మాకూ ఉంది
ఎదగాలని సోకూ ఉంది !
మాకున్నదిలే ఒకే ఒక గుడిస
మాకన్నవారు పోయారు వలస
మేం ఏకాకులమయ్యాం ఇప్పుడు
మా చీకాకుల చితి ఆరేదెన్నడు ?
ఆకలి దప్పులు ఇక పోటేస్తుంటే
ఈ కలికాలం మము కాటేస్తుంటే
మేం మా బడిబాటను పట్టేదెట్లా
మా బడిగంటను ఇక కొట్టేదెట్లా ?
కాలం కూడా మాపై పగబట్టింది
వేలం వేసి మాలో పొగబెట్టింది
దిక్కుదివానం లేక తిరుగుతున్నం
అలసి సొలసి మేం కరుగుతున్నం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి