"సప్తపది అంటే ఏడు అడుగులు కలిసి నడవడం"
"సఖాసప్తసదాభవ "వరుడు వధువు ఇద్దరు కలిసి ఏడడుగులు వేస్తే మిత్రత్వం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. మన పెద్దలు దీన్నే ఏడడుగుల సంబంధం అని అంటారు.
మరి వధూవరులు ఏడడుగులు ఎందుకు వేస్తారో చూద్దాం.
వరుడు వధువు నడుము పై చేయి వేసి దగ్గరగా తీసుకొని అగ్నిహోత్రమునకు దక్షిణ వైపున నిలబడి తూర్పు దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగు పెట్టి ఏడు అడుగులు నడవాలి.
ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెబుతాడు పురోహితుడు.
మొదటి అడుగు-----ఏకం ఇషే విష్టుఃత్వా అన్వేతు.
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక
రెండో అడుగు------ద్వేఊర్జే విష్ణు కృత్వా అన్వేతు.
ఈ రెండవ అడుగుతో మనిద్దరకు శక్తి లభించినట్లు చేయుగాక!
మూడవ అడుగు-----త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు.
ఈ మూడవ అడుగు వివాహ వ్రత సిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక.
నాలుగవ అడుగు----చత్వారి మయోభవాయ విష్ణుఃత్వా అన్వేతు.
ఈ నాలుగోవ అడుగు మనకు ఆనందమును విష్ణువు కలిగించుగాక.
ఐదవ అడుగు-----పంచ పశుభ్యో విష్ణు విష్ణుః త్వా అన్వేతు.
ఈ ఐదవ అడుగు మనకు పశు సంపదను విష్ణువు కలిగించుగాక.
ఆరవ అడుగు-----శడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు.
ఈ ఆరవ అడుగు ఆరు రుతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.
ఏడవ అడుగు----సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు.
ఈ ఏడవ అడుగు గృహస్తాశ్రమ ధర్మ నిర్వాహణకు విష్ణువు అనుగ్రహించుగాక!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి