ఓ బుజ్జి బుజ్జి కన్నయ్య
మా బుల్లి బుల్లి చిన్నయ్య
మారము నీవు చేయకయ్య
మా రాజువు నీవే లేవయ్యా !
మీ అమ్మ జాడ లేకున్నా
మీ నాన్న కూడా రాకున్నా
నీకు తోడు నీడ నేనున్నా
నీవు ఏడవకురా నా కన్నా !
మీ అమ్మలా నేను లాలిస్తా
కన్న నాన్నలా నే బులిపిస్తా
చిందువేసి నా ముందుకొస్తే
చందమామను నే చూపిస్తా !
నిన్ను తాతల వచ్చి ఆడిస్తా
నే తాయిలం తెచ్చి తినిపిస్తా
నీ వెతలన్నీ ఇక నే మరిపిస్తా
నే కథలెన్నో నీకిక వినిపిస్తా !
అమ్మలా గోరుముద్దలు తినిపిస్తా
నాన్నలా ముద్దు కథలు వినిపిస్తా
నీ ఏడుపు గోలను నేనిక విన్నా
నీ ఏడుపును మాని రారా కన్నా !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి