మా తెలంగాణ సీనారే సిరిసిల్ల
రాజన్న జిల్లా యందు పుట్టిండు
మా తేనె తేట తేట మాగాణ ఖిల్లా
గోలకొండ యందు కాలు పెట్టిండు!
ఉర్దూ మీడియం ఆదిపత్యంతో డిగ్రీ పట్టా సంపాదించిండు ఇక్కడ
సర్దుబాటు సోదర భావంతో తను
అగ్రి ఐ పరబ్రమించాడులే అక్కడ!
వెలుగు ఉర్దూ భాషను పారశీక భాషను తాను ఎంచుకున్నడు
తెలుగు పైఇష్టం పెంచుకున్నాడు
తోటి జనం కష్టం పంచుకున్నాడు!
ఎవరయ్యా వాడు ఇంకెవరయ్యా వీడు
తెలుగు ఉర్దూ పారశీక భాషలపై
పట్టున్న రేడు
అతనే మన సింగిరెడ్డి నారాయణరెడ్డి
సిరి గంధపు మనందరి బంగారపు
కడ్డీ !
అస్త్రాలను శస్త్రాలను సాహిత్యంలో సంధించాడు
మంత్రాలను యంత్రాలను మాటల్లో పాటల్లో బంధించాడు
సరికొత్త ప్రక్రియలతో కొంగ్రొత్త కావ్యాలను అందించాడు
అర్థం వ్యర్థం కాకుండా పరమార్ధం ఉండాలని బోధించాడు !
మాకు బుద్ధిని అందించే మహా మంత్రం నీ మాట
ఏంచి గద్దె నెక్కించే స్వాహా తంత్రం నీ పాట
జానపదం నుండి జ్ఞానపీఠదాకా ఎదిగేలా చేసింది
నవ్వని పువ్వు నుండి నవ పార జాతాలు అందేలా చూసింది !
అమ్మ ప్రేమ గీతాలను కమ్మగా వల్లించావు
కొమ్మ లేమ గేయాలను కన్ను గీటి మల్లిం చావు
అమ్మైన కొమ్మైన ఆధారం వారన్నావు
సొమ్మైనా సోకైనా వారే మన గతి అన్నావు !
ఆయన రాసిన పాటలు పున్నమి వెన్నెల కాస్తాయి
స్వయాన కూసిన మాటలు కన్నుల పండుగ చేస్తాయి
రుచి అభిరుచియై అందరిని అభిమానులుగా మారుస్తాయి
సురుచిర సుందర సుమధుర తీరాలకు చేరుస్తాయి !
జానపద జావలి గీతాలను బహు చక్కగా వ్రాసినారు
జ్ఞానపద దీపావళి గేయాలను ఎం చక్కగా అచ్చేసినారు
వాదించి సాధించారు తెలుగు భాష పై గట్టిపట్టు
అవి మీ కీర్తి పతాకాన్ని హిమ శిఖరంపై నిలబెట్టు !
ఆయన గులేబకావళి చిత్రంలోని ఉబాలించు పాటలు
స్వయానా స్వీయ కమనీయ కలం నుండి దూకిన ముత్యాలమూటలు
అందులో నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసాని అనే పాట
ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది అందరి తెలుగు వారి నోట !
స్వర్గీయ సింగిరెడ్డి నారాయణరెడ్డి పుట్టినట్టి కొత్త జిల్లా సిరిసిల్లా
ఆయనకీరోజు మనం నివాళులు అర్పించి తరిద్దాం మనమెల్లా
వారిని కొలుద్దాం మన వాణిని వినమని తలుద్దాం మనం నిలువెల్లా
స్వయాన ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చి దీవించనుగా ఇక మన అల్లా !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి