అమ్మ స్మృతి పథంలో : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
నీరు, ఎరువు, 
కాంతి తోడ తరువు ఎదిగినట్లు
ఎంత యాతనబడితివమ్మా మా ఎదుగుదల కొరకు

కాయకష్టం చేసి ఒళ్ళు హూనం చేసుకొని 
మా ఉన్నతికై
క్రొవ్వొత్తిలా కరిగిపోతివిగదమ్మామాకు కాంతిజూపగా

గిరులు సైతం జలధారలతో అరిగి తరిగినట్లు
తరిగిపోతివి,
నడుమువిల్లులా ఒంగిపోతివిగదమ్మా
 కుటుంబంబరువుబాధ్యతలు మోసి మోసి 

మా పసితనంలోనే మాఅయ్య కాలం చేస్తే
మాకు నువ్వే వెన్నెముకైతివిగదమ్మా

ఎండకు ఎండి వానకు తడిసి 
కడుపునిండా తింటివో 
మా కడుపులునింపి కడుపుమాడ్చుకొని పడుకుంటివో!?

నేను ప్రయోజకుడనై నీకో ముద్ధన్నం పెట్టే సమయంలో 
మా కంటి నుండి దూరమైపోతివి 

మా కళ్ళముందు నీ పాదముద్రలు 
మా మనసులోన పదిలం
 నీ జ్ఞాపకాలు 
ఏ దైవం చూపని ప్రేమకు త్యాగానికి ప్రతీకే మా అమ్మ


కామెంట్‌లు