గురుదేవుల మేలి మాటలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
ప్రతి నిముషము ఓర్పుతో 
బ్రతుకులోన నేర్పుతో 
ఉండాలోయ్! చురుకుగా 
పదిమందికి స్ఫూర్తిగా 

సడలని సంకల్పంతో 
విడవని విశ్వాసంతో 
అభివృద్ధి పథంలోన 
నడవాలోయ్! భువిలోన 

కోపంపై జయంతో 
విలువైన వినయంతో 
సమాజాన బ్రతకాలోయ్!
ప్రశాంతంగా ఉండాలోయ్! 

మహాత్ముల స్నేహంతో 
మమతానురాగాలతో 
తలపించాలి నాకము 
హర్షించాలి లోకము 


కామెంట్‌లు