చిగురులు చూడని
చిన్ని గువ్వకు
చిరునవ్వులు తోడయేలా
చింతలు బాపే నేస్తం!
ఆకులు రాలిన కొమ్మకు
ఆసరా ఇచ్చి నడిపే
ఆశలు చిగురించేలా
ఆదరణ చూపే నేస్తం!
ఋతువు మారడంతో
రంగులు మారిన శోభలను
రంజింప చేసే తీరున
రమణీయంగా చేసే నేస్తం!
కరిగిన కనకపు వర్ణాల
గగనపు అందము చూచి
తరగని మమతకు తానే
పరవశించి వేంచేయు నేస్తం!
పరుగులు తీయుచు సాగే
పాల మబ్బుల మదిలో
పరవళ్లు తొక్కే ఉత్సాహం
పంచి మురిపించె నేస్తం!
బ్రతుకున మరియొక దినము
బహుమతిగా ఇవ్వాలని
వదలక విధిగా వచ్చి
చెదరని ధైర్యం పంచే నేస్తానికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి