వశిష్ట మహర్షి ఆతిథ్యం విశ్వామిత్రుని కోరుట : - ఎడ్ల లక్ష్మి -\సిద్దిపేట
వశిష్ఠుడు విశ్వామిత్రునికి స్వాగతం పలికి 
ఆసనముపై అలంకరింప జేసి
ఫలములతో అతిథి పూజలు చేసినాడు 
విశ్వామిత్రుడు సత్కారమునొందినాడు

బ్రహ్మసుతుడు జప తపస్సంపన్నుడు
విశ్వామిత్రుని కుశలముల నడిగెను 
నీ మిత్రులు,పుత్రులు కుశలమేనా స్వామి 
ఓ వశిష్ట అందరూ కుశలమే స్వామి 

ధర్మమూర్తులిరువురు సంతోషముతో 
ప్రీతికరముగా చక్కని కథలు చెప్పుతూ 
ఎంతో సమయాన్ని గడిపినారు 
విశ్వామిత్రునికి పండ్లు ఫలాలు ఇచ్చినాడు 

వశిష్ట ఇక మాకు వెళ్ళుటకు సెలవు నొసగము
నా అతిథిసత్కారము పూర్తి కాలేదయ్యా
వశిష్ఠుడు కామధేనువును పిలిచి 
ఇచ్చటికి నీవు త్వరగా రావమ్మా 

ఈ మహార్షికి తగిన భోజన సత్కారములకు
ఏర్పాట్లు చేయుమని ఆజ్ఞాపించాడు
కామదేనువు రుచికరమైన భోజనాన్ని 
సిద్ధపరచమని వశిష్ఠుడు తెలిపినాడు 


కామెంట్‌లు