ఆకలుండదు - దాహ ముండదు ,
కంటి మీద - కునుకు ఉండదు !
కనులు మూసినా - నీ రూపమే!
కనులు తెరిచినా - నీ ద్యాసనే !
నీడ లాగా వెంటాడుతావు ,
వెనుతిరిగి చూస్తే మాయమై పోతావు !
ఫోనులో పలుకరిస్తావు ,
మేనులో అలజడి సృస్టిస్తావు ,
నేను స్పందించే లోపు
మూగనోము పడతావు...!
నీ కంటి చూపుతో కట్టేస్తావు ,
నీ కను సైగ తోనే నెట్టేస్తావు ,
నాకు ఎప్పటికీనువ్వు అర్ధంకావు !
కానీ ___నా ఊహల్లో ఎన్నటికీ దూరం కావు !
నీ ఆలోచనలతో నా గుండె బరువెక్కిస్తావు !
కలలోకి వస్తావు - కవ్విస్తావు !
కనబడగానే ఏమీ ఎరగనట్లు నవ్వేస్తుంటావు !
ప్రేమంటే ఇదేనేమో అనే భ్రమలో నేనుమాత్రంబ్రతికేస్తుంటాను !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి