సుప్రభాత కవిత : - బృంద
తూరుపున అరుదెంచే 
సూర్యుడి తేరు వెలుగుల
ఎరుపు కాంతి పుంజాలు
పరచుకున్న నింగి దారులు

తొంగి చూసి దూరాన 
రానున్న మిత్రుడి రాకకై 
ఆతృత తో ఎదురుచూస్తూ 
వంగి నిలిచిన చిన్ని చెట్టు....

తరలివచ్చు దినకరునికి 
ధరణి ద్వారాన వేలాడు 
తలిరాకుల తోరణాలుగా 
తన శాఖలను భావించె!

గాలితో గుసగుసగా 
కబురు తెలిసిన ఆకులు 
గలగలమను సవ్వడితో 
సరిగమలు ఆలపించె!

గగనంలో ఎగిరే విహగాళి 
రెక్కలు జెండాల్లా ఊపి
చుక్కల దారిలో వచ్చు 
చక్కని తేరును స్వాగతించె!

కాళ్ళు కడగాలని 
కడలేని ఆరాటంతో 
కడలి త్వర త్వరగా 
కెరటాలను తీరానికి తరిమె!

రానున్న వెలుగులకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు