ఆశలు తీరే ఆరాటంలో
ఆనందం అర్ణవమైతే
అదుపే లేని ఊహలతో
అంబరం అందినట్టు....
సందేహమే లేక ఎదలో
సంతోషమేదో కలిగి...
సంవేదనలు మాయమై
సందడి చేస్తున్నట్టు....
గతపు చీకటి మరచి
వెలుగు దారిలో వెడుతూ
దిగులు చెందక సాగుతుంటే
దూరం తరిగి పోతున్నట్టు...
ఎదను కమ్మిన వెతలు
వదలిపోయె తరుణమేదో
కదలి వచ్చి కరుణించి
కలత తీరిపోయినట్టు....
తాకుతున్న చల్లగాలి
చెబుతున్న కబురేదో
ఎదురుచూసే ఎడదను
ఊయల ఊపుతున్నట్టు...
ఉల్లము పల్లవించేలా
మెల్లగా తరలి వచ్చి
చల్లని దీవెనలిచ్చి..
తల్లిలా ఆదరించు ఉదయానికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి