సుప్రభాత కవిత : - బృంద
హాయిగా తడిసి వెలుగుల్లో 
వేయిగా విరిసె అడవుల్లో 

ఎవరికోసమో ఎదురుచూడదు 
ఎవరూ మెచ్చుకోవాలనుకోదు 

అమాయకంగా నవ్వుతూ 
అందంగా ఆకర్షిస్తుంది 

వేవేల వర్ణాల సోయగాలతో 
ఈ నేల పై తారలా వెలుగుతుంది

దాచుకున్న పరిమళం తానే 
వీచే గాలికి అప్పచెబుతుంది

అందంగా  హాయిగా ఊగుతూ 
ఆహ్లాదం మనసుకు కలిగిస్తుంది

తొలి కిరణం తాకగానే 
రెక్కల కన్నులు తెరుస్తుంది 

వెలుగుతున్న లోకంలో 
తాను కూడా భాగమైపోతుంది 

వాడిపోతానని  వేదనలేదు 
వీడిపోతానని భయంలేదు 

చిన్ని బ్రతుకుని ఆనందంతో 
మిన్నగా బ్రతికి రాలిపోతుంది 

ఉన్న కొద్ది రోజులు 
ఉన్నతంగా బ్రతకమని...
ప్రతిరోజూ మనకొక 
అవకాశం ఇస్తూ వచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు