ప్రభువు రాకకు పరవశించి
ప్రథమ హారతి ఇవ్వనెంచి
పటపట రెక్కల చప్పుడుతో
పక్షులన్నీ ప్రయత్నించే!
రెక్కల రెప్పలు తీసి
చక్కగ కొత్తగా విరిసి
మొక్కులిడి మోకరిల్ల
పెక్కు కమలములు వేచె!
ఒడలి నిండా విరిసిన
తామర తంపర దాచిన
తేనెల తుంపర నివేదించి
విందు చేయనెంచిన ....
నిండు మనసున నిలిపిన
కొండంత మమత పండి
ఎదలోని దేవుడు ఎదురవగా
కాసారమునకు కల వరించె!
తొలగించి తిమిరపు నీడ
వెలుగుపూల వాన కురిపించి
వసుధను కాంతుల తడిపి
మధువనిగా మార్చనెంచి....
కిరణపు చేతులతో
ఆణువణువూ పులకరించగ
ధరణిని కౌగిలించి ముద్దాడు
తరణికి స్వాగతం చెబుతూ
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి