పదిలో సత్తా చాటిన కడుము హైస్కూల్ ఫలితాలు
ముఖేష్ మోహిత్ కుమార్

  పదోతరగతి ఫలితాల్లో కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటుకున్నారని ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. 52 మంది పరీక్షలకు హాజరు కాగా 48 మంది ఉత్తీర్ణులైనారు, అనగా 92 శాతం ఉత్తీర్ణులైనారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలందు ఉత్తీర్ణతా శాతంలో మెరుగైన స్థానంలో ఈ కడుము హైస్కూల్ నిలుచుట తమకెంతో గర్వకారణమని ప్రధానోపాధ్యాయులు తిరుమలరావు ఆనందం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులను ముఖేష్ మోహిత్ కుమార్ సాధించాడు. 568 మార్కులతో ఈ పాఠశాల ప్రథమ ర్యాంకర్ గా ప్రతిభ కనబరిచిన ముఖేష్ మోహిత్ కుమార్ ను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.తర్వాత స్థానాల్లో చల్లా అమృత 555, తెంబూరు శిరీష 532, ఎం.త్రివేణి 530, టి.అరవింద్ 529, బి.మోక్షిత 524, కిల్లారి మధు 512, టి.కీర్తన 508, కిల్లారి సోనియా 502, బూరాడ రేణుక 502, మేఘా రావు 501, జి.తరుణ్ 500 మార్కులతో మెరుగైన ప్రతిభను సాధించారు. ఐతే, 100 కి 100 మార్కులను గణితం, సాంఘిక శాస్త్రంలందు ముఖేష్ మోహిత్ కుమార్,  టి.అరవింద్ లు సాధించడం విశేషం. 99మార్కులతో సైన్స్ నందు ముఖేష్ మోహిత్ కుమార్, 98మార్కులతో తెలుగు నందు చల్లా అమృతలు నిలిచి మిక్కిలి ప్రతిభను చాటుకున్నారు.
కామెంట్‌లు