ప్రేమంటే....!!*: - ప్రో:శామ్ సుందర్.చింతా- మస్కట్.

 సృష్టిలోని  తియ్యని పదం
ప్రేమ....
సంపూర్ణ భావనలకు
అది నుడికారం,!
సుమధుర పరిమళాలు 
వెదజల్లే పుష్పం,
సదా ప్రజ్వలిల్లే దైవిక శాస్త్రం!
మాతృమూర్తుల ముంగిట
 మసలే_
మానవ సరోవరం,
సహోదర సహృదయానందమును,
సంకలన పరచే పుటం,
సమాధాన సంగతులను
విశదపరచే సత్యం
మహా కావ్యాల సంపుటికి 
మరపురాని సాహిత్యం!
కాలం మారినా కలం ఆగినా
కడలి కరడు కరడని కదంత్రొక్కినా ....
గళం గతి తప్పినా ........
గానం శ్రుతి తప్పినా........
గగనపుటంచులవరకు
 గణనీయమైనది ప్రేమయే .! 
సుదూరతీరాలను_
సుగమనము చేసేది,
సామరస్య సుజ్ఞానమును 
సమన్వయపరచేది,
సనాతన స్వభావాలను
సమూలద్వంసము చేసేది
సువిశేషా సుబుద్దులను 
సునాయాసము చేసేది,
ప్రేమ.....
పస లేని ప్రసంగం
పరిధి లేని ప్రవాహం
ప్రాస లేని పద్యం
ప్రేమ తెలియని జీవితం ఒక్కటే! 
ప్రేమే సంస్కృతి,
ప్రేమే ఆకృతి,
ప్రేమే ప్రకృతి,
ప్రేమే సున్నతి.
ప్రేమంటే పెళ్లి మాత్రమేకాదు!
ప్రేమంటే పరమాత్ముడు.కూడా.!!
                   ***

కామెంట్‌లు