అధిక ఉష్ణోగ్రతలతో మండే
వేసవికి మన శరీరం తేమను కోల్పోతూనే ఉంటుంది
పదే పదే చల్లని మంచినీటితో పాటు శీతల పానీయాలు తాగాలనిపిస్తుంది..
అవి ఎప్పటినుంచో నిల్వ ఉండే
రసాయనాలు..
కొన్ని దేశాల్లో బాన్ చేసిన
కూల్ డ్రింక్స్ ని మన దేశంలో
విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు..
అయినా వాటిని మనం చాలా
డబ్బులు పెట్టి కనుక్కొని మరీ తాగుతున్నాం..అలాగే
కరెంటుతో తయారయే
రిఫ్రిజిరేటర్ వాటర్ కన్న..
మట్టి కుండ నీరు ఎంతో
శ్రేష్టమైనది..
సహజమైన పండ్ల రసాలు..
ఫ్రూట్ సలాడ్లు పసందైనవి..
నిమ్మకాయతో చేసిన షర్బత్,
స్వచ్ఛమైన కొబ్బరినీళ్లే కుశలమైనవి..
పల్చని మజ్జిగ
ఒంటికి చాలా మేలైనది..
నానబెట్టిన సబ్జా గింజలు, నిమ్మరసం పంచదార
కలిపిన నీళ్లు శరీరంలో
వేడిని తగ్గిస్తాయి..
కల్తీ లేని చెరుకు రసం..
శరీరానికి చలువను
చెలిమిగా అందిస్తుంది..
అప్పుడప్పుడైనా
బత్తాయి రసం తాగడం వల్ల
శరీరంలోని రోగనిరోధక శక్తిని కాపాడే
తెల్ల రక్త కణాలు తగ్గిపోకుండా ఉంటాయి..
ఇంకా చాలా రకాల
చిట్కాలు మన ఇంట్లోనే ఉన్నాయి..
ఇలాంటి మంచి పానీయాలను ఎంచుకోవడం వల్ల ఈ వేసవిలో వడదెబ్బ తగిలే ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి