అది 1932. సైకిల్ దొంగతనం చేశాడనే కారణంగా రాబర్ట్ అనే 15 ఏళ్ల నల్లజాతి బాలుడికి జార్జియాలోని ఒక సంస్కరణాలయంలో ఐదేళ్ల శిక్ష విధించారు. అతనికి చదవడం రాదు, మాట్లాడటం తప్ప.
అయితే అక్కడ ఉన్న మొదటి సంవత్సరంలో, ఓరోజు ఎదురు మాట్లాడినందుకుగాను అతన్ని రెండు సార్లు కొట్టారు. రెండోసారి కొట్టడమే కాకుండా ఒక నెల రోజుల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచారు. ఎవరినీ అక్కడ ఇతరులతో ఎలాంటి సంబంధమూ ఉండేది కాదు. ఆ గదిలో రోజుకు ఒక గంట తప్ప వెలుతురు ఉండేది కాదు.
రెండో రోజు, ఒక కాపలాదారుడు అతని మీద జాలిపడి గదిలోని సందులోంచి ఒక బైబిల్‌ను అతని కోసం గది లోపలికి జారవిడిచాడు. ఆ గదిలో ఉన్నది ఈ పుస్తకం తప్ప మరేదీ లేదు.
రాబర్ట్ అంతకు ముందు ఎప్పుడూ పుస్తకాన్ని చేత పట్టుకుని ఎరుగడు. అయినా అతను ఆ పుస్తకాన్ని తెరిచాడు. అందులోని పదాలు వంకరటింకరగా అనిపించాయి. ఆ అక్షరాల మీదే తన వేలితో దిద్దే వాడు
రోజురోజుకీ, అతను తాననుకున్నది సమీపంలోని చర్చిలోంచి వినవచ్చే శబ్దాలతో అనుసంధానించడం మొదలుపెట్టాడు.
“జి-ఓ-డి ....గాడ్,
జె-ఇ-ఎస్-యు-ఎస్....జీసస్.” ఇలా కూడబలుక్కుని కొన్ని కొన్ని మాటలు చదివేవాడు. పదే పదే వాటిని పలికేవాడు.
20వ రోజు వచ్చేసరికి, అతను బైబిల్లోని 23వ కీర్తనను చదవగలిగాడు. ఖాళీగా ఉన్న ఆ గదిలో దాన్ని బిగ్గరగా చదివేవాడు. ఆయన తర్వాత ఇలా అనుకున్నాడు : “నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను. కానీ ఎవరో వింటున్నట్లు అనిపించింది.” అని.
ఏకాంతవాసం నుండి బయటకు వచ్చినప్పుడు, రాబర్ట్ ఇంకా ఖైదీగానే ఉన్నాడు. కానీ అతను స్వయం కృషితో అక్షరాస్యుడయ్యాడు. చదువు కున్న వారిలా ప్రవర్తిస్తే” అక్కడి సిబ్బంది మరింత శిక్షిస్తారని నిరక్షరాస్యుడిలా నటించేవాడు. ప్రవర్తించేవాడు. అయితే సిబ్బందికి తెలియకుండా అతను రాత్రిపూట వసతిగృహంలోని ఇతర అబ్బాయిలకు బైబిల్ పాఠాలు చెప్పేవాడు.
రాబర్ట్ 1937లో విడుదలయ్యాడు. అతను అట్లాంటాలోని ఒక పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు. 12 సంవత్సరాల పాటు పాఠశాల గ్రంథాలయంలోని ప్రతి పుస్తకాన్ని చదివాడు. అతను 1978లో మరణించాడు. అతని పిల్లలలో ఒకరు ఉపాధ్యాయుడు, మరొకరు నర్సు, ఇంకొకరు న్యాయవాది అయ్యారు.
అతను తన బైబిల్‌లో తాను గమనించిన దానిని ఇలా రాశాడు : “నన్ను మానసికంగా దెబ్బతీయడానికి వాళ్ళు నన్ను ఒక అరలో బంధించారు. అయితే వారు నా నుండి అక్షరాలను, మాటలను వేరు చేయలేకపోయారు.”
1930లలో దక్షిణ ప్రాంత జైలు వ్యవస్థలలో స్వయంకృత అక్షరాస్యతకు సంబంధించిన వాస్తవ సంఘటనల ఆధారమే ఈ నాలుగు మాటలకూ మూలం. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఎంతైనా తెలుసుకోవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి