ఉదాసీనత! :- డా ప్రతాప్ కౌటిళ్యా.
లోకం చాలా పెద్దది 
కానీ 
ఎదురు చూడడానికి 
ఏమీ లేదు. 

జీవితం చాలా పెద్దది 
కానీ 
పొందడానికి ఏమీ లేదు. 

సముద్రం చాలా పెద్దది 
వర్షం కురవడానికి సిద్ధం 
కానీ 
సముద్రానికి అది 
పెద్ద విషయం కాదు. 

మనసు చాలా పెద్దది 
కానీ 
అందులోకి రావడానికి 
ఎవరు సిద్ధంగా లేరు. 

మనకు తెలుసు మనం 
మాయమవుతామని 
కానీ 
నమ్మం-అదే నమ్మకం 
ఒకరోజు బద్దలవుతుంది 
అబద్ధం అవుతుంది. 

ఇన్నాళ్లు ఎదురు చూసింది 
ఎవరికోసం 
ఇన్నాళ్లు నిరీక్షించింది 
దేనికోసం 
చివరకు మిగిలేది 
నిరాశ ఉదాసీనత.!?

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు