పార్వతి దేవి దేవతలతో ఇలా అంటుంది
దేవతలారా నాకు అప్రియమైన పనిని చేసినారు
అందుకు మీరు తగిన ఫలమును అనుభవించుడు
కోపముతో పార్వతి కనులెర్ర చేసినది
సూర్య తేజస్సుతో పార్వతి జలము చేత బూని
దేవతలందరినీ ఆమె శపించినది
నా పతితో కూడి పుత్రున్ని పొందాలనీ నా కోరిక
నాకు మీరు అవరోదన కలిగించినారు
నీ భార్యలకు మీతో సంతానము కలుగదు
మీ పత్నులు సంతానవంతులు కాకుందురు
ఈ విధముగా దేవతలతో పలికింది పార్వతి
అదే కోపంతో భూదేవిని కూడా శపించినదట
దుర్బుద్ధి గల ఓ భూదేవి వినుము
నీవు చౌడు నేలగా వేరు వేరు నేలలుగా ఉంటావు
నీవు పెక్కుమంది రాజులకు భార్యవు అయ్యేదవు
నాకు పుత్రుడు పుట్టకుండా అడ్డుపడితివి
ఓ నేల తల్లి నీకు సుఖ సంతోషాలు ఉండవు
పార్వతి దేవి శాపమునకు గురి అయిన
దేవతలందరూ సిగ్గుతో తలవంచగా
అది గమనించిన శివుడు పశ్చిమ దిశగా వెళ్ళినాడు
పరమశివుడు హిమపర్వతమునకు
ఉత్తరదిశయందున్న శిఖరముపై
పార్వతి దేవితో కూడి తపస్సు చేసినాడు
రామ పార్వతి దేవి గూర్చి మీకు విపులముగా తెలిపినాను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి