పాడరా… పాడరా… (గానవిహారం) : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
పాడరా… పాడరా… పిల్లలపాట పాడరా,
పలుకుల పరిమళాలు చిమ్మరా,
నవ్వుల చినుకులు చల్లరా,
నెమలి నాట్యాలు చేయించరా॥
|| పాడరా… ||

పాడరా… పువ్వులపాట పాడరా,
పొంగుల సందడి పంచరా,
రంగుల రాగాల రేపరా,
రమణీయ లోకాలు చూపరా॥
|| పాడరా… ||

పాడరా… పల్లెలపాట పాడరా,
పంటపొలాల పలుకులు జార్చరా,
గాలి గుసగుసల్లో గీతం కలపరా,
గడ్డి గులకరాళ్ళ గానం వినిపించరా॥
|| పాడరా… ||

పాడరా… ప్రేమపాట పాడరా,
హృదయ తంతుల్ని తాకరా,
నిశ్శబ్ద రాగాల నడుమ సాగరా,
నిత్యానురాగం నింపరా॥
|| పాడరా… ||

పాడరా… ప్రకృతిపాట పాడరా,
పొంకాల ప్రొద్దు పొడిపించరా,
భావాల బాటలో పయనించరా,
భువినంతా ఆనందింపజేయరా॥
|| పాడరా… పాడరా… ||


కామెంట్‌లు