తాండూరులో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి శిబిరం : వెంకట్ , మొలక ప్రతినిధి
 విద్యార్థులలో నైతిక విలువలు, ఆధ్యాత్మికత మరియు సామాజిక స్పృహను పెంపొందించడమే లక్ష్యంగా తాండూరు పట్టణంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఘనంగా ప్రారంభమైంది. సమితి అధ్యక్షులు బాలకృష్ణ మరియు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
​బాలకృష్ణ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా రామకృష్ణ సేవా సమితి విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని అధ్యక్షులు బాలకృష్ణ తెలిపారు. ముఖ్యంగా ఇంటర్, ఎస్ఎస్‌సీ విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ధైర్యాన్ని ఇచ్చే మోటివేషన్ క్లాసులు నిర్వహించామని గుర్తుచేశారు.
​మార్కుల కోసం కాదు.. మార్పు కోసం: ఈ సమ్మర్ క్యాంప్ కేవలం మార్కుల కోసం కాదని, విద్యార్థులలో సానుకూల మార్పు తీసుకురావడం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజూ రెండు గంటల పాటు సాగే ఈ శిబిరంలో:
​స్వామి వివేకానంద సూక్తులు.
​భగవద్గీత శ్లోకాలు.
​యోగా మరియు ధ్యానం.
​సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటలపై శిక్షణ ఉంటుందని వివరించారు.
​ ప్రోగ్రాం కన్వీనర్ KVM వెంకట్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకునే "వివేకానంద  సాహిత్యం" విద్యార్థులలో పెంపొందించడం కోసమే ఈ క్యాంప్ ఉద్దేశమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి శిబిరాలకు పంపి ప్రోత్సహించాలని కోరారు.వ్యక్తిత్వ వికాసం: యువ అవధాని ధీరజ్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, విద్య  ధర్మం అనేవి మనిషికి రెండు కళ్ల వంటివని, వాటిని ప్రతి  భారతీయుడు అలవర్చుకోవాలని  సూచించారు.​ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి గౌరవాధ్యక్షులు గాజుల బసవ రాజు, కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అభ్యాస్ హై స్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ కవిత దంపతులు, ఉపాధ్యాయులు రఘు, సరిత, నవనీత, జాహ్నవి, స్వప్న. విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు